స‌మంత ప్రొఫైల్ లో అక్కినేని మిస్సింగ్ ఎందుకు?

Update: 2021-08-25 11:30 GMT
ఇంత‌కుముందే ఓ ఇంట‌ర్వ్యూలో ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదంపై ముచ్చ‌టించింది స‌మంత‌. త‌న‌ సోషల్ మీడియా ప్రొఫైల్ పేరు సమంత అక్కినేని నుండి సింపుల్ S గా మార్చడానికి కార‌ణ‌మేమిటి? అన్న ప్ర‌శ్న ఎదురైంది. దానికి స‌మంత ఆన్స‌ర్ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అస‌లు ఇలాంటి వాటి గురించి మాట్లాడే మూడ్ లో లేనని సామ్ పేర్కొన్నది. నేను ఏదైనా వివాదం లేదా ట్రోల్ పై మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రమే స్పందిస్తాను`` అని అన్నారు. కానీ ఇలా ఎన్నాళ్ల‌ని దాచ‌గ‌ల‌రు? అన్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్న‌. దీనికి స్పందిస్తూ. ``నేను ఆ విషయాలలో దేనికీ స్పందించాలనుకోవడం లేదు. నాకు వివాదాలు నచ్చవు. ఎవరికైనా వారి స్వంత అభిప్రాయాలకు ఎలా అర్హత ఉంటుందో నేను కూడా నా హక్కుకు అర్హత కలిగి ఉన్నాను`` అని సామ్ చెప్పింది. అక్కినేని కుటుంబంలో భాగం కావడం వల్ల ఎలాంటి కఠినమైన ఎంపికలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

నాకు అసాధార‌ణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన అభిమానుల కోస‌మే నేను సినిమాలు చేస్తాన‌ని కూడా ఎప్పుడూ చెప్ప‌లేదు. న‌చ్చిన‌వి చేసుకుంటూ వెళుతున్నాను అని సామ్ తెలిపారు. ప‌ద‌కొండేళ్లుగా న‌టిగా బిజీగా ఉండ‌డం నాపై ప్రభావం చూపుతున్నందున ఇప్పుడు నటన నుండి విరామం తీసుకుంటానని తెలిపారు.

నేను ఆందోళ‌న చెందితే అది చైత‌న్య గురించి అత‌డి సినిమాల గురించి. చై న‌టించిన ల‌వ్ స్టోరి రిలీజ్ గురించి ఆలోచిస్తున్నాను. నా సినిమాల విడుదలల గురించి అలాగే చైత‌న్య‌ గురించి నేను ఆందోళన చెందుతున్నాను.. ఆత్రుతగా ఉన్నాను అని సామ్ అన్నారు.

ఇదే ఇంట‌ర్వ్యూలో స‌మంత తమిళ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. తాను న‌టించిన `ఫ్యామిలీ మ్యాన్ 2`లో రాజీ పాత్ర‌ వివాదాస్ప‌ద‌మైంది. ఆ పాత్ర ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిస్తే అందుకు క్ష‌మాప‌ణ‌లు. నిజానికి ఇది ఉద్ధేశ పూర్వ‌కంగా చేసిన పాత్ర కానే కాద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.

సమంత అక్కినేని కెరీర్ గ్రాఫ్ గురించి చెప్పాలంటే... తదుప‌రి పౌరాణిక చిత్రం శాకుంతలంలో కనిపించ‌నుంది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ తో స్క్రీన్ స్పేస్ పంచుకుంది. ఈ చిత్రం మహాకవి కాళిదాసు రాసిన `అభిజ్ఞాన శాకుంతలం` అనే ప్రాచీన నాటకం ఆధారంగా రూపొందించిన‌ది. అల్లు అర్జున్ కుమార్తె అర్హ .. క‌లెక్ష‌న్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. క‌రోనా క్రైసిస్ క‌ష్ట కాలంలో ప్రారంభ‌మైనా అత్యంత వేగంగా గుణ‌శేఖ‌ర్ ఈ చిత్రాన్ని పూర్తి చేసారు. ఇటీవ‌లే గుమ్మ‌డి కాయ కార్య‌క్ర‌మంలో స‌మంత‌..అర్హ-గుణ‌శేఖ‌ర్ టీమ్ సంద‌డి చేశారు. అలాగే న‌య‌న‌తార‌- విఘ్నేష్‌- సేతుప‌తి ల త‌మిళ చిత్రంలోనూ స‌మంత ఒక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. భ‌ర్త చైత‌న్య‌తో క‌లిసి మ‌జిలీ త‌ర‌హాలో మ‌రో సినిమాలో న‌టించేందుకు స‌మంత స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 స‌క్స‌స్ త‌ర్వాత నెట్ ఫ్లిక్స్ తో భారీ వెబ్ సిరీస్ కోసం డీల్ కి సంత‌కం చేశార‌న్న ప్ర‌చారం ఉంది.





Tags:    

Similar News