బన్నీ- వంగా ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లేదప్పుడే!
కొన్ని కొన్ని విషయాలు సందర్భంతో పని లేకుండా వార్తల్లోకి వస్తుంటాయి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అలాంటి ఓ విషయం వార్తల్లోకి వచ్చింది.;
కొన్ని కొన్ని విషయాలు సందర్భంతో పని లేకుండా వార్తల్లోకి వస్తుంటాయి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అలాంటి ఓ విషయం వార్తల్లోకి వచ్చింది. పుష్ప సినిమాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్, ఫాలోయింగ్, డిమాండ్ ఏ స్థాయిలో పెరిగాయో అందరికీ తెలిసిన విషయమే. పుష్ప2 తర్వాత కొన్నాళ్ల పాటూ గ్యాప్ తీసుకున్న బన్నీ తన తర్వాతి సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్నారు.
లోకేష్ కనగరాజ్ తో అల్లు అర్జున్ మూవీ
అట్లీ సినిమా తర్వాత బన్నీ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు రీసెంట్ గానే అనౌన్స్‌మెంట్ వచ్చింది. లోకేష్ తో బన్నీ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చాక బన్నీ లైనప్ గురించి మరోసారి డిస్కషన్ మొదలైంది. ఎందుకంటే అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా రానున్నట్టు ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ గతంలోనే అనౌన్స్ చేసింది.
బన్నీ- వంగా ప్రాజెక్టుపై అనుమానాలు
అట్లీ తర్వాత బన్నీ, సందీప్ డైరెక్షన్ లోనే సినిమా చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సడెన్ గా లోకేష్ సినిమా అనౌన్స్‌మెంట్ రావడంతో అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. అసలు బన్నీ- సందీప్ సినిమా ఉందా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దానికి తోడు అనౌన్స్‌మెంట్ తర్వాత బన్నీ- వంగా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు.
ఈ నేపథ్యంలోనే అందరూ ఈ ప్రాజెక్టు విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్- సందీప్ రెడ్డి వంగా సినిమాపై లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది. బన్నీ- వంగా కాంబినేషన్ 2027 మే నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని, అట్లీ ప్రాజెక్టు తర్వాత బన్నీ చేయబోయే సినిమా వంగా తోనే అని, అలాగే ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్న సందీప్ రెడ్డి, ఆ తర్వాత డైరెక్ట్ చేయబోయే హీరో అల్లు అర్జునే అని తెలుస్తోంది.