'సామ్ జామ్' షోలో పొలిటికల్ రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్..!

Update: 2020-12-26 07:15 GMT
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా కొన్నేళ్లుగా రాజ్యమేలుతున్న చిరంజీవి.. ఆ మధ్య పాలిటిక్స్ లోకి వెళ్లి సుమారు 10 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత చిరు రాజకీయాలకు దూరమై 'ఖైదీ నెం.150' సినిమాతో గ్రాండ్‌ గా రీ ఎంట్రీ ఇచ్చారు. వరుస పెట్టి సినిమాలను అనౌన్స్ చేస్తూ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ మెగాస్టార్ మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్తారా అనే డౌట్ ఎక్కడో మెగా అభిమానుల్లో ఉంది. ఆ మధ్య చిరు మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నారని.. ఆయనకు ఓ జాతీయ పార్టీ రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసిందనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా చిరంజీవి పాల్గొన్న టాక్ షో లో పొలిటికల్ రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేశారు.

తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా'లో స్టార్‌ హీరోయిన్‌ సమంత హోస్ట్ చేస్తున్న 'సామ్‌ జామ్‌' టాక్ షోలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. క్రిస్మస్‌ కానుకగా ఈ మెగా ఎపిసోడ్ ని నిన్న 'ఆహా' యాప్ లో స్ట్రీమింగ్ చేశారు. ఈ సందర్భంగా చిరు పొలిటికల్ రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో చాలా తెలుసుకున్నానని.. పాలిటిక్స్‌ అసలు తనకు సెట్‌ అవ్వవని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నటుడిగా చాలా సంతోషంగా ఉన్నానని.. ఇకపై తాను కేవలం మెగాస్టార్ మాత్రమే అని.. రాజకీయాల జోలికి వెళ్ళనని తెలిపారు. అలాగే మరో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా నటుడిగానే పుట్టాలని కోరుకుంటానని చిరు అన్నారు. ఈ సమాధానంతో రాజకీయాలలోకి వచ్చే ప్రసక్తే లేదని చిరంజీవి కుండ బద్దలు కొట్టేశారు. కాగా, 2008లో 'ప్రజారాజ్యం' పార్టీ పెట్టి.. ప్రజలకు సేవ చేద్దామని వెళ్లిన చిరంజీవి.. ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఆ పార్టీని జాతీయ కాంగ్రెస్‌ లో విలీనం చేశారు. కొన్నాళ్లు రాజ్యసభ సభ్యుడిగా చేసిన చిరంజీవి.. ఆ తర్వాత రాజకీయాలకు దూరమై సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
Tags:    

Similar News