కిక్‌ కాదు.. దాని మీద కన్నేశాడు

Update: 2015-09-03 07:17 GMT
బాలీవుడ్‌ హీరోలు టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినిమాల్ని రీమేక్‌ చేస్తూ వందల కోట్లు ఆర్జిస్తున్నారు. సక్సెస్‌ ఫార్ములాని అక్కడి నేటివిటీకి అనువుగా మార్చుకుని ఇక్కడికంటే పెద్ద రేంజులో హిట్టు కొడుతున్నారు. అప్పట్లో మహేష్‌ హీరోగా నటించిన పోకిరి చిత్రాన్ని సల్మాన్‌ వాంటెడ్‌ పేరుతో రీమేక్‌ చేశాడు. 100కోట్లు పైగా వసూలు చేసిందీ చిత్రం. ఇప్పుడు మరో తమిళ హిట్‌ చిత్రం రీమేక్‌ హక్కుల్ని చేజిక్కించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.

జయం రవి, నయనతార జంటగా మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన తాని ఒరువన్‌ (టీవో)  ఇటీవలి కాలంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఈ సినిమా స్పెషల్‌ షో సల్మాన్‌ ఖాన్‌ అండ్‌ ఫ్యామిలీ కోసం ముంబైలో వేస్తున్నారు. సల్మాన్‌ ఈరోజు సినిమా చూడబోతున్నారు. అంతేకాదు .. ఈ సినిమా పై ఇప్పటికే సల్మాన్‌ ఆసక్తి చూపిస్తున్నారు. అన్నీ ఫైనల్‌ అయితే మోహన్‌ రాజానే హిందీ వెర్షన్‌ కి కూడా దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు.

చెడుకి, మంచికి జరిగే పోరాటమే ఓటీ సినిమా. ఇందులో అరవింద స్వామి ఓ కీలకపాత్ర పోషించారు. అటు కోలీవుడ్‌ సహా అన్నిచోట్లా ఈ సినిమా గురించి మంచి టాక్‌ వినిపించింది. అందుకే బాలీవుడ్‌ లో సల్మాన్‌ అంత ఆసక్తి చూపిస్తున్నారు. సల్మాన్‌ వాంటెడ్‌ తర్వాత మళ్లీ ఓ రీమేక్‌ తో అంతటి పెద్ద హిట్‌ రిపీట్‌ చేయాలన్న కోరికతో ఉన్నాడు. ఈసారి తీరేట్టే ఉంది మరి. అయితే మన కిక్‌ 2 మీద కన్నేశాడు అని వచ్చిన రూమర్లన్నీ జస్టు రూమర్లే.
Tags:    

Similar News