మొబైల్ యాప్ బ్రాండ్ అంబాసిడర్ గా కండలవీరుడు యాప్ ఏంటంటే??

Update: 2021-04-02 17:30 GMT
ఈ మధ్యకాలంలో టెక్నాలజీ అనేది ఎంతగా డెవలప్ అవుతుందో అంతే వేగంగా డిజిటల్ మీడియా మాధ్యమాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఎంటర్టైన్మెంట్ మొబైల్ యాప్స్ చాలా ఉన్నాయి. ఇదివరకు టిక్ టాక్, హలో లాంటి ఎంటర్టైన్మెంట్ యాప్స్ దేశంలో బాన్ చేయబడ్డాయి. ఐతే ఈ యాప్స్ ద్వారా షార్ట్ వీడియోస్ చేస్తూ తమలోని టాలెంట్ ప్రూవ్ చేసుకోవచ్చు అని.. ఎవరికీ వారే యాక్టింగ్ పరంగా మంచి కెరీర్ క్రియేట్ చేసుకోవచ్చని తెలిసిందే. కానీ వాటి ప్రభావం జనాల మీద విపరీతంగా చూపుతుందని టాక్ నడుస్తుంది. తాజాగా 'చింగారి' అనే ఎంటర్టైన్మెంట్ యాప్ బ్రాండ్ అంబాసిడర్ గా, ఇన్వెస్టర్‌గా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ను ప్రకటించింది చింగారి మొబైల్ యాప్ యాజమాన్యం.

టెక్ 4 బిలియన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం నిర్వహిస్తున్న చింగారి యాప్.. 2020 డిసెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా 4 1.4 మిలియన్లకు పైగా బ్లూ-చిప్ మద్దతుదారులను సొంతం చేసుకుందట. ఈ యాప్ యాజమాన్యంలో ఏంజెల్ జాబితా, ఐసీడ్, విలేజ్ గ్లోబల్, బ్లూమ్ ఫౌండర్స్ ఫండ్, జాస్మిందర్ సింగ్ గులాటి ఇతరులు భాగస్వామ్యంగా ఉన్నారట. తాజాగా సీఈఓ సుమిత్ ఘోష్ మాట్లాడుతూ.. 'సల్మాన్ ఖాన్ మా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ తో పాటు పెట్టుబడిదారులలో ఒకరిగా ఉండడం మా అదృష్టం' అని అన్నారు.

"షార్ట్ వీడియో ఫామ్ అనేది భారతదేశంలో విపరీతంగా విస్తరిస్తోందని, లక్షలాది మంది కంటెంట్‌ను సృష్టించడానికి ఉపయోగిస్తున్న ప్లాట్ ఫామ్" యుబిటి సహవ్యవస్థాపకుడు విక్రమ్ తన్వర్ తెలిపారు. ఇక సల్మాన్ మాట్లాడుతూ.. "చింగారి యాప్ ఇండియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎంటర్టైన్మెంట్ యాప్స్ లో ఒకటి. ఇది యూజర్స్ తో పాటు కంటెంట్ క్రియేటర్ లకు యూస్ అవుతుంది. ఇంత తక్కువ వ్యవధిలో విలేజ్ నుండి సిటీ వరకు లక్షలాది మంది టాలెంట్ చూపేందుకు అలాగే.. మిలియన్స్ జనాలు ఇతరుల టాలెంట్ చూసేందుకు క్రియేట్ చేసిందని" చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News