'ఆదిపురుష్‌' లంకేష్‌ రాజకీయ అవతారం

Update: 2020-12-18 04:38 GMT
బాలీవుడ్ స్టార్స్ ఈ మద్య కాలంలో ఓటీటీ కంటెంట్‌ పై దృష్టి పెడుతున్నారు. ప్రముఖ స్టార్స్ పలువురు ఓటీటీ కంటెంట్ లో నటించేందుకు ముందుకు వస్తున్నారు. ఆదిపురుష్‌ లో కీలక పాత్రలో నటించబోతున్న సైఫ్‌ అలీ ఖాన్‌ ఒక ఓటీటీ మూవీలో నటించాడు. అదే పొలిటికల్ డ్రామా అయిన తండవ్‌. అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఆ మూవీకి సంబంధించిన టీజర్‌ ను విడుదల చేశారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ కథలో పలు ఆసక్తికర విషయాలను చూపించబోతున్నారు.

ఇండియాలో ప్రస్తుతం రాజకీయం నడుస్తోంది. ప్రధాని ఎవరైతే అవుతారో వారే రాజుగా వెలుగుతారు. ప్రధాన మంత్రి అవ్వడం కోసం ఏం చేసేందుకు అయినా సిద్దంగా ఉండాలి అన్నట్లుగా టీజర్‌ లో కథ నేపథ్యంను చెప్పకనే చెప్పారు. టీజర్‌ లో సైఫ్‌ అలీ ఖాన్‌ చాలా పవర్‌ ఫుల్‌ గా కనిపించడంతో పాటు లుక్స్‌ పరంగా కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇదో విభిన్నమైన పొలిటికల్‌ డ్రామా అన్నట్లుగా టీజర్‌ చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న 'తండవ్‌' అమెజాన్‌ ప్రైమ్‌ లో జనవరి 15 న స్ట్రీమింగ్‌ కాబోతుంది.
Full View
Tags:    

Similar News