శ్యామ్‌ సింగరాయలో లేడీ విలన్‌ 'ఫిదా' చేయనుందా?

Update: 2020-08-26 09:50 GMT
నాని నటించిన 25వ సినిమా 'వి' విడుదలకు సిద్దం అయ్యింది. కరోనా వచ్చి ఉండకుంటే ఆయన శ్యామ్‌ సింగరాయ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యేది. కాని కరోనా కారణంగా అయిదు ఆరు నెలలుగా షూటింగ్స్‌ లేకపోవడంతో ఎక్కడికి అక్కడ నిలిచి పోయాయి. మళ్లీ మెల్లగా పనులు ప్రారంభం అవుతున్నాయి. నాని శ్యామ్‌ సింగరాయ సినిమాకు సంబంధించిన వర్క్‌ షురూ అయినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో సినిమాలో సాయి పల్లవి కీలక పాత్రలో కనిపించబోతుందని అంటున్నారు.

సాయి పల్లవి హీరోయిన్‌ గానే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పింది. దాంతో ఆమెను ఈ సినిమాలో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో చూపించబోతున్నారట. ఈ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు చేసిన పాత్రకు పూర్తి విభిన్నమైన పాత్రను సాయి పల్లవి చేయబోతుంది. నాని గెటప్‌ మరియు పాత్ర కూడా ఈ సినిమాలో చాలా విభిన్నంగా ఉంటుందని మేకర్స్‌ ఇప్పటికే హింట్స్‌ ఇస్తున్నారు. సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు.

నాని, సాయి పల్లవి ఇప్పటికే ఎంసీఏ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ అయ్యింది. కనుక వీరి కాంబోలో రాబోతున్న మలి సినిమా శ్యామ్‌ సింగరాయ కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి కాకుండా మరో హీరోయిన్‌ కూడా ఉంటుందట. సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు అతి త్వరలో దర్శకుడు రాహుల్‌ సంక్రీత్యన్‌ ప్రకటించబోతున్నాడు.
Tags:    

Similar News