అనిల్ చ‌మ‌త్కారం..నెటిజ‌న్‌ల సెటైర్లు!

20240 నాటికి మ‌న రిపోర్ట‌ర్ల స్థానంలో రోబోలనే వార్త‌లు క‌వ‌ర్ చేయ‌డానికి పంపిస్తారేమో` అంటూ అనిల్ రావిపూడి చ‌మ‌త్క‌రించారు.;

Update: 2026-04-06 09:35 GMT

వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో దూసుకుపోతున్న యంగ్ హీరో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌. ల‌వ్‌టుడే, డ్రాగ‌న్‌, డ్యూడ్ వంటి సినిమాల‌తో వంద కోట్లు కొల్ల‌గొట్టి హీరోగా హ్యాట్రిక్ హిట్‌ల‌ని త‌న ఖాతాలో వేసుకున్న ప్ర‌దీప్ ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నాడు. తను న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ `ల‌వ్ ఇన్సూరెన్స్ కంప‌నీ`. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2040 ఇయ‌ర్‌లో జ‌రిగే ఫ్యూచ‌రిస్టిక్ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుద‌ల కానుంది. అప్పుడు ఉండే ప‌రిస్థితులు, అడ్వాన్స్ టెక్నాల‌జీని ఆవిష్క‌రిస్తూ ఈ మూవీని రూపొందించారు.

ఎస్‌.జె. సూర్య కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా, కృతిశెట్టి క‌థ‌నాయిక‌గా న‌టించింది. ప్ర‌చార చిత్రాల‌తో అంచ‌నాల్ని పెంచేసిన ఈ సినిమా రిలీజ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ హైద‌రాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజుతో పాటు హిట్ మెషీగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. భ‌విష్య‌త్తులో సాంకేతిక‌త ఏ స్థాయికి చేరుకుంటుందో వివ‌రిస్తూ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ పై నెట్టింట చ‌ర్చ జ‌రుగుతోంది.

20240 నాటికి మ‌న రిపోర్ట‌ర్ల స్థానంలో రోబోలనే వార్త‌లు క‌వ‌ర్ చేయ‌డానికి పంపిస్తారేమో` అంటూ అనిల్ రావిపూడి చ‌మ‌త్క‌రించారు. ఏఐ, రోబోటిక్స్ వేగ‌వంతంగా అభివృద్ది చెందుతున్న నేప‌థ్యంలో అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అచ‌యితే అనిల్ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్‌లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎంత టెక్నాల‌జీ పెరిగినా హ్యుమ‌న్ ట‌చ్ అవ‌స‌ర‌మ‌ని కామెంట్‌లు చేస్తున్నారు. దీంతో అనిల్ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట ట్రెండ్ అవుతూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని మాంచి జోష్ మీదున్న అనిల్ రావిపూడి అదే జోష్‌తో మ‌రో క్రేజీ సినిమాకు శ్రీ‌కారం చుడుతున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్‌, క‌ల్యాణ్ రామ్‌ల క‌ల‌యిక‌లో ఈ భారీ మల్టీస్టార‌ర్ కామెడీ యాక్ష‌న్ డ్రామాని త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News