ప‌ర భాష న‌టుల కామెంట్‌పై జేడీ ఒపీనియ‌న్ ఇదీ!

తాజాగా ఇదే త‌ర‌హా ప్ర‌శ్న జెడీ చ‌క్ర‌వ‌ర్తికి ఎదురైతే ఆయ‌న ఆస‌క్తిక‌రంగా స్పందించారు.;

Update: 2026-04-06 09:38 GMT

టాలీవుడ్ ఆర్టిస్ట్‌ల‌ని విస్మ‌రిస్తూ కొంత మంది డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు ప‌ర భాష‌ల‌కు చెందిన న‌టీన‌టుల‌ని ఎక్కువ‌గా తెలుగు కోసం తీసుకొస్తున్నార‌ని, దాని వ‌ల్ల తెలుగులో ఉన్న టాలెంటెడ్ ఆర్తిస్ట్‌ల‌కు ప‌ని లేకుండా పోతోంద‌నే కామెంట్‌లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కోట శ్రీ‌నివాస‌రావు లాంటి న‌టులు బాహాటంటానే దీనిపై కామెంట్‌లు చేశారు. ప్ర‌కాష్ రాజ్ లాంటి ప‌ర భాష న‌టుల‌ని ప్రోత్స‌హిస్తున్నార‌ని, ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా ఇదే త‌ర‌హా ప్ర‌శ్న జెడీ చ‌క్ర‌వ‌ర్తికి ఎదురైతే ఆయ‌న ఆస‌క్తిక‌రంగా స్పందించారు.

చాలా కాలంగా తెలుగు సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్న జెడీ చ‌క్ర‌వ‌ర్తి తెలుగులో త‌రుణ్ భాస్క‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `గాయ‌ప‌డ్డ సింహం`లో న‌టించారు. మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో జేడీ చ‌క్న‌వ‌ర్తి పాల్గొని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు ఆర్టిస్ట్‌ల‌ను ప‌క్క‌న పెట్టి ప‌ర భాష న‌టుల‌ను తీసుకుంటున్నారు అన్న‌ది క‌రెక్ట్ కాదు. మా లాంటి న‌టుల‌ను ముందుగా అప్రోచ్ అయినా మా లాంటి వాళ్లు కొన్ని సార్లు నో చెప్ప‌డం వ‌ల‌న వేరే భాష న‌టుల‌కు వెళ్లివుండ‌వ‌చ్చు` అన్నారు.

లేదా కొన్ని సంద‌ర్భాల‌లో ఆ క్యారెక్ట‌ర్‌కు వాళ్లు మాత్ర‌మే స‌రిపోతార‌ని భావించి ద‌ర్శ‌కుడు తీసుకున్న నిర్ణ‌యం కూడా అయివుండోచ్చు. అంతే కానీ మ‌న తెలుగు వాళ్ల‌ని ప‌క్క‌న పెట్టి ప‌ర భాష న‌టుల కోసం వెళుతున్నారు అనేది క‌రెక్ట్ కాదు. క్యారెక్ట‌ర్ ఫిట్‌నెస్ అనేది ఒక‌టి ఉంటుంది. కొన్ని క్యారెక్ట‌ర్ల‌కు ద‌ర్శ‌కుడు ఎవ‌రిని అనుకుంటున్నారో వాళ్లే స‌రిపోతారు` అన్నారు. ఇదే సంద‌ర్భంగా థియేట‌ర్స్‌ని టెంపుల్స్ అంటారు క‌దా? దీనిపై మీ ఒపీనియ‌న్ అని అడిగితే త‌న‌దైన శైలిలో స్పందించారు.

థియేట‌ర్ టెంపుల్ అయితే మీరు స్నానం చేసే థియేట‌ర్స్‌కు వెళుతున్నారా?..గాళ్ ఫ్రెండ్‌తో ప‌క్క‌న కూర్చుని సినిమా చూస్తున్నారా? ..టెంపుల్‌లో ఇవ‌న్నీ చేస్తారా ఎవ‌రైనా? థియేట‌ర్ అనేది ఒక క్రియేటివ్ ప్లేస్‌. అక్క‌డికి వెళ్లి ఎంట‌ర్‌టైన్ అవ్వాల‌నుకుంటారు. టెంపుల్‌కి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి వెళ‌తామా? ఇది ఏంటంటే చెప్పుకోవ‌డానికి బాగుంటాయిని కాయినింగ్ చేస్తుంటారు. ఆ సౌండింగ్ న‌చ్చి మిగ‌తా వాళ్లు ఫాలో అవుతారు` అంటూ సెటైర్లు వేశారు. జెడీ చ‌క్ర‌వ‌ర్తి వేసిన సెటైర్లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.




Tags:    

Similar News