'మహేంద్రగిరి వారాహి' రిలీజ్ డేట్ లాక్.. ఆ మూవీకి గట్టి పోటీ తప్పదా?

అక్కినేని కాంపౌండ్ నుండి వచ్చిన హీరో సుమంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Update: 2026-07-23 08:00 GMT

అక్కినేని కాంపౌండ్ నుండి వచ్చిన హీరో సుమంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విభిన్నమైన జానర్లలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. ఒకవైపు హీరోగా, మరొకవైపు విలన్ గా సినిమాలలో నటిస్తూనే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా మెప్పిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఆధ్యాత్మిక అంశాల నేపథ్యంలో.. విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలా ఆధ్యాత్మిక సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న చిత్రమే మహేంద్రగిరి వారాహి.

సస్పెన్స్ థ్రిల్లర్ గా మహేంద్రగిరి వారాహి..

భక్తి ,పురాతన నమ్మకాలు, సైన్స్ అండ్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ ఆధ్యాత్మిక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నుండి ఇదివరకే అఫీషియల్ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహేంద్రగిరి కొండల బ్యాక్ డ్రాప్ లో వారాహి మాత దివ్యశక్తి చుట్టూ అల్లిన ఒక కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణంగా నిలవబోతోందని మేకర్స్ స్పష్టం చేశారు.. ఆధ్యాత్మిక శ్లోకాలతో పాటు థ్రిల్లింగ్ సీన్స్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ఆయన మ్యూజిక్ అందించినట్లు తెలుస్తోంది..

విడుదల తేదీ ఎప్పుడంటే..

ప్రతాప్ ఆర్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించగా.. అన్నపూర్ణ స్టూడియోస్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సుమంత్ సరసన మీనాక్షి గోస్వామి హీరోయిన్గా నటిస్తుండగా.. బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, మాళవిక నాయర్, వెన్నెల కిషోర్, అలీ లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. సెప్టెంబర్ 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో బజ్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడనుంది.

మహేంద్రగిరి వారాహికి పోటీగా ఎపిక్..

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ తెరపైకి రావడంతో మరొకవైపు ఈ సినిమాకి మరో మూవీ గట్టి పోటీ ఇవ్వబోతోంది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ప్రముఖ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఎపిక్ సినిమాను ఈ తేదీలలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అటు సెప్టెంబర్ 11న విజయ్ దేవరకొండ రణబాలి సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో జాప్యం ఏర్పడడం వల్ల సినిమా విడుదలకు ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సెప్టెంబర్ 11న ఎపిక్ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాలు భిన్నమైన జానర్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఏ చిత్రం ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News