చెన్నై లవ్ స్టోరీ మూవీలో ఆ జంట చేయాల్సిందా? డైరెక్టర్ ఏమన్నారంటే?
విభిన్నమైన కథలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా రాబోతున్న ప్యూర్ రొమాంటిక్ డ్రామా మూవీ చెన్నై లవ్ స్టోరీ.
విభిన్నమైన కథలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా రాబోతున్న ప్యూర్ రొమాంటిక్ డ్రామా మూవీ చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ నెల 24వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా జోరుగా మొదలుపెట్టారు చిత్ర బృందం. ఇదిలా ఉండగా మరొకవైపు జూలై 23న అనగా నేడు జన నాయగన్ సినిమా విడుదల అవ్వడంతో రేపు విడుదల కాబోయే తమ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రచారాలు మొదలుపెట్టారు.
విడుదలకు సిద్ధం అవుతున్న చెన్నై లవ్ స్టోరీ..
ఇకపోతే చెన్నై లవ్ స్టోరీ కోసం అటు హీరో, హీరోయిన్ ఇటు మేకర్స్ గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి స్థానంలో మొదట ఒక సూపర్ హిట్ జోడి ఉండాల్సింది. అయితే అనూహ్యంగా వారిద్దరు తప్పుకోవడంతోనే వీరిద్దరూ కథలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా జంట మారిపోవడం వెనక అసలు కారణం తెలియదు కానీ డైరెక్టర్ చేసిన కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఆ జంట ఎవరు? ఎందుకు సినిమా నుంచి తప్పుకున్నారు.? డైరెక్టర్ ఏమన్నారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
మొదట అనుకున్నది ఎవరినంటే?
అసలు విషయంలోకి వెళ్తే.. బేబీ సినిమాతో పెద్ద సంచలనం సృష్టించారు డైరెక్టర్ సాయి రాజేష్. అప్పటికే తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. పైగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది అంటే సినిమా సత్తా ఏంటో తెలిసిపోతుంది. అందుకే ఈ సినిమా విడుదలైన కొన్ని నెలలకే ఇదే చిత్ర హీరో, హీరోయిన్ తో సాయి రాజేష్ మరో కొత్త ప్రాజెక్టు ప్రకటించాడు. ఈ సినిమాకి స్క్రిప్ట్ కూడా సాయి రాజేష్ అందించాడు.
అనూహ్యంగా స్క్రిప్ట్ లోకి కిరణ్, గౌరీ ప్రియ..
అయితే దర్శకుడిగా మాత్రం రవి నంబూరిని అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది అంటూ వార్తలు రాగా.. ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేదు. నెలలు గడిచినా కూడా ఎవరు ఈ ప్రాజెక్టుపై ప్రస్తావించలేదు. ఇక దీంతో ఈ ప్రాజెక్టు లేనట్టే అనుకునే సమయంలో అనూహ్యంగా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా ఈ సినిమా పట్టాలెక్కింది. పైగా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సాయి రాజేష్ దీనిపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయం చెప్పిన డైరెక్టర్..
ఆయన మాట్లాడుతూ.. చెన్నై లవ్ స్టోరీ సినిమాలో బేబీ సినిమా హీరో, హీరోయిన్ తో చేయాలనుకున్న మాట వాస్తవమే. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో నటులు మారిపోయారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు రెండేళ్లయినా.. మూడేళ్లయినా.. దానికి అందరూ కట్టుబడి ఉండాలి అని నేను అనుకుంటాను. ఇక అందరూ నాలాగే ఆలోచించరు కదా అంటూ సాయి రాజేష్ తెలిపారు.. ఇకపోతే దీనిపైన ఆ జంట వివరణ ఇస్తారో లేదో తెలియదు కానీ ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఎపిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సెప్టెంబర్ 11న ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా.. ఈ జంటకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.