చిన్న వయసులోనే జాన్వీ అంత ఇబ్బంది పడిందా?

జాన్వీ తెలిపిన వివరాల ప్రకారం, తాను కేవలం 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ ఇష్యూ జరిగింది.;

Update: 2026-04-06 12:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. చిన్న వయసులోనే డీప్‌ఫేక్‌ టెక్నాలజీ కారణంగా ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఆమె ఒక పాడ్‌ కాస్ట్‌ లో రీసెంట్ గా వెల్లడించారు. ఈ సంఘటన తనపై ఎంత ప్రభావం చూపిందో చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

జాన్వీ తెలిపిన వివరాల ప్రకారం, తాను కేవలం 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ ఇష్యూ జరిగింది. అప్పట్లో స్కూల్‌ లో చదువుకుంటున్న సమయంలోనే ఒక రోజు తన స్నేహితులు అశ్లీల వెబ్‌ సైట్‌ లో తన ఫోటోలు ఉన్నాయని చెప్పారని గుర్తు చేసుకున్నారు. అయితే అవి అసలు తన ఫోటోలు కాకుండా, మార్ఫింగ్ లేదా డీప్‌ఫేక్‌ టెక్నాలజీ ద్వారా తయారు చేసినవని తర్వాత తెలిసిందని చెప్పారు.

ఆ సంఘటన గురించి తెలుసుకున్న క్షణంలో తాను తీవ్రంగా షాక్‌ కు గురయ్యానని, ఏమి చేయాలో అర్థం కాలేదని జాన్వీ చెప్పారు. "ఆ సమయంలో చాలా ఒత్తిడికి లోనయ్యాను. ఎంతో బాధ పడ్డాను. ఒక చిన్న వయసులో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపించింది" అని ఆమె పేర్కొన్నారు. ఆ ఘటన తనకు సోషల్ మీడియాలో మోరల్ వాల్యూస్ ఎంత తక్కువగా ఉన్నాయో అర్థమయ్యేలా చేసిందని జాన్వీ వెల్లడించారు.

"ఎవరో చేసిన పనికి నేను బాధపడాల్సి రావడం చాలా అన్యాయం అనిపించింది. అప్పుడే భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని అర్థమైంది" అని చెప్పారు. ఇక డీప్‌ఫేక్‌ సమస్య ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందని జాన్వీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తనకు సంబంధించిన ఏఐ (AI) ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయని అన్నారు.

కొన్నిసార్లు చాలా మంది కూడా అవే తన ఒరిజినల్ పిక్స్ గా భావించి వైరల్ చేస్తున్నారని తెలిపారు. "అందుకే కొన్ని సందర్భాల్లో దీనిపై గట్టిగా మాట్లాడాలని అనిపిస్తుంది. కానీ నాకు అంత పవర్ లేదా వాయిస్‌ ఉందా అన్న సందేహంతో మౌనంగా ఉండిపోతా" అని జాన్వీ అన్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి డీప్‌ ఫేక్‌ చిత్రాలను ఎక్కువగా పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు.

అయితే జాన్వీ ఇష్యూ ద్వారా సోషల్ మీడియాలో టెక్నాలజీ దుర్వినియోగం ఎంత డేంజరో మరోసారి స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా, జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌ లోనే కాకుండా సౌత్ సినిమాల్లో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా తెలుగులో తెరకెక్కుతున్న పెద్ది చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె.. ఆ సినిమాలో రామ్ చరణ్ సరసన సందడి చేయనుంది.

Tags:    

Similar News