గాయపడ్డ సింహంలో JD మాస్ లుక్.. బ్రూటల్ ధర్మ గ్లింప్స్‌ చూశారా?

తాజాగా చిత్రబృందం విడుదల చేసిన బ్రూటల్ ధర్మ గ్లింప్స్‌ తో ఆ మూవీపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.;

Update: 2026-04-06 11:39 GMT

తెలుగు సినీ ఇండస్ట్రీలో విభిన్న కథాంశాలతో వస్తున్న సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి కేటగిరీలోకి వస్తున్న చిత్రం గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమా ఇప్పటికే మంచి బజ్‌ ను సంపాదించుకుంది. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన బ్రూటల్ ధర్మ గ్లింప్స్‌ తో ఆ మూవీపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

గ్లింప్స్‌ లో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ.. అన్నీ కలిసి ఆయన పాత్రను మరో లెవల్‌ కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా బ్రూటల్ ధర్మ అనే పాత్రలో ఆయన కనిపించిన తీరు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కామెడీతో పాటు సీరియస్ షేడ్స్ ఉన్న ఆయన రోల్.. సినిమా కథలో కీలకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

గాయపడ్డ సింహం సినిమా కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్‌ గా ఉండటం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీలకు వ్యతిరేకంగా తెలుగు యువత పోరాడే కథాంశంతో ఆ సినిమా రూపొందుతోంది. కామెడీ టచ్‌ తో చెప్పబోయే ఆ స్టోరీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై మంచి హైప్ తీసుకువచ్చాయి.

ఇప్పుడు బ్రూటల్ ధర్మ గ్లింప్స్ విడుదలతో ఆ హైప్ మరింత పెరిగింది. ముఖ్యంగా జేడీ చక్రవర్తి పాత్ర ఎలా ఉండబోతుంది? ప్రధాన పాత్రలతో ఆయన సంబంధం ఏమిటి? కథలో ఆయన రోల్ ఎలాంటి మలుపులు తిప్పుతుంది? వంటి ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మొత్తానికి బ్రూటల్ ధర్మ గ్లింప్స్‌ అదిరిపోయిందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.

ఇక గాయపడ్డ సింహం చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి, భాను ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ కుమార్ బన్సల్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టెక్నికల్‌ గా సినిమా మంచి స్టాండర్డ్స్‌ తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ మే 1న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆ సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్, యువత ఎక్కువగా థియేటర్లకు వచ్చే అవకాశముండటంతో సినిమా మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. మొత్తానికి గాయపడ్డ సింహం సినిమాతో కొత్త కాన్సెప్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. తాజాగా వచ్చిన గ్లింప్స్ చూస్తుంటే మూవీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతుందనే భావన కలుగుతోంది. మరి విడుదల తర్వాత సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.


Full View


Tags:    

Similar News