'ధురంధర్'.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ రికార్డ్!

కేవలం నార్త్ ఇండియాలోనే కాకుండా, సౌత్ మార్కెట్ తో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా హవా కొనసాగుతోంది.;

Update: 2026-04-06 11:39 GMT

బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఒక ఎత్తు, అసలు ఎవరికీ అందనంత ఎత్తులో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడం మరో ఎత్తు. ప్రస్తుతం ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్’ సరిగ్గా ఇదే చేస్తోంది. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ కంటే రెండో భాగం చూపిస్తున్న ఇంపాక్ట్ ఊహాతీతంగా ఉంది. రణవీర్ సింగ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, ఆదిత్య ధర్ టేకింగ్ తో ఈ చిత్రం కేవలం మూడు వారాల్లోనే భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని వసూళ్లను సాధించింది. కేవలం నార్త్ ఇండియాలోనే కాకుండా, సౌత్ మార్కెట్ తో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా హవా కొనసాగుతోంది.



 


సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతి రోజు ఒక కొత్త రికార్డు నమోదవుతోంది. ముఖ్యంగా మూడో వీకెండ్‌లో కూడా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. థియేటర్లలో రన్ మొదలై 18 రోజులు గడుస్తున్నా, ఆడియన్స్ డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు కొత్త సినిమాలు పోటీగా వస్తున్నా, ‘ధురంధర్’ తన పట్టును నిలబెట్టుకుంటూ వేయి కోట్ల నెట్ వసూళ్ల మార్కును దాటేసింది. ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో కేవలం మూడు వారాల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం.

అసలు విషయానికి వస్తే, ‘ధురంధర్: ది రివెంజ్’ భారత్ లో 1000 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డ్ సృష్టించింది. మూడు వారాల ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 1,622 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి గ్లోబల్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 25 మిలియన్ డాలర్లు, జర్మనీలో 1 మిలియన్ యూరోలు దాటిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే మొదటి భాగం లైఫ్ టైమ్ ఓవర్సీస్ కలెక్షన్లను అధిగమించింది.

సినిమాలోని విజువల్స్ యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయి. యాక్షన్ బ్లాక్స్ లో రణవీర్ బాడీ లాంగ్వేజ్, ఆ ఇంటెన్సిటీ సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. ట్రైలర్ లో చూసిన ఆ భారీ పేలుళ్లు, చేజింగ్ సీన్లు వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తున్నాయి. క్వాలిటీ విషయంలో ఆదిత్య ధర్ ఎక్కడా రాజీ పడకుండా ఈ రివెంజ్ డ్రామాను ఒక విజువల్ స్పెక్టకిల్ లా తీర్చిదిద్దారు. ఈ లెక్కలు గమనిస్తే, సినిమా ఎంత స్ట్రాంగ్ గా బాక్సాఫీస్ వద్ద నిలబడిందో అర్థమవుతుంది. మూడో వీకెండ్‌లో కేవలం మూడు రోజుల్లోనే (శుక్ర, శని, ఆది) రూ. 80 కోట్లు రాబట్టడం అరుదైన విషయం.

బాక్సాఫీస్ వసూళ్ల లెక్కలు ఇలా ఉన్నాయి:

ఇండియా నెట్ వసూళ్లు: రూ. 1041.00 కోట్లు

ఇండియా గ్రాస్ వసూళ్లు: రూ. 1,228.00 కోట్లు

ఓవర్సీస్ వసూళ్లు: రూ. 394.00 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్: రూ. 1,622.00 కోట్లు

Tags:    

Similar News