సీన్‌ రివర్స్‌.. సాయి పల్లవి మరీ ఇంత కమర్షియల్ గా ఉంటుందా?

Update: 2020-12-26 05:38 GMT
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఇబ్బడి ముబ్బడిగా ఆఫర్లు వస్తున్నా కూడా ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకున్న ఈఅమ్మడు చేసిన ప్రతి సినిమా మంచి పేరును తెచ్చి పెట్టాయి. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నించింది. వెబ్ సిరీస్ ల్లో కూడా ఈమె నటించి మెప్పించింది. ఇలాంటి సాయి పల్లవి కొన్ని రోజుల క్రితం ఒక బ్రాండ్ ప్రమోషన్‌ కు భారీ పారితోషికం ఆఫర్‌ వచ్చినా కూడా ఇష్టం లేక తిరష్కరించిందట. ఆ బ్రాండ్‌ వల్ల యువత చెడిపోతారని మరియు జనాలను మోసం చేయడం ఇష్టం లేదనే ఉద్దేశ్యంతో ఆ బిగ్‌ డీల్ ను సాయి పల్లవి వదిలేసింది అంటూ ప్రశంసలు దక్కించుకుంది. సీన్‌ కట్‌ చేస్తే ఇప్పుడు సాయి పల్లవి మరీ ఇంత కమర్షియల్‌ ఏంటో అంటున్నారు.

విషయం ఏంటీ అంటే.. పవన్‌ రానాలు నటించబోతున్న మలయాళ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమా రీమేక్‌ లో ఒక హీరోయిన్‌ గా ఐశ్వర్య రాజేష్‌ ను ఎంపిక చేశారట. ఆమె రానాకు జోడీగా కనిపించబోతుంది. ఇక మరో హీరోయిన్‌ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారు. ఈ సినిమా మల్టీ స్టారర్‌ మూవీ. కనుక హీరోయిన్‌ లకు ఎక్కువ స్కోప్‌ ఉండక పోవచ్చు. అయితే సినిమాలో హీరోయిన్స్‌ కనిపించేది కొద్ది సమయమే అయినా కథ రీత్యా వారు చాలా స్ట్రాంగ్‌ గా ఉంటారట. అందుకే నటన ప్రతిభ ఉన్న హీరోయిన్స్ ను ఎంపిక చేయాలని వీరిద్దరిని సంప్రదించారు.

సాయి పల్లవి ఈ సినిమాలో కేవలం వారం నుండి పది రోజులు నటించేందుకు ఏకంగా రెండు కోట్లు డిమాండ్‌ చేసిందట. పవన్‌ తో సినిమా అయినా తక్కువ డేట్లు అయినా కూడా తన పారితోషికం అంతే మీ ఇష్టం అన్నట్లుగా నిర్మాతలకు సమాధానం చెప్పిందట. దాంతో నిర్మాతలు ఆలోచల్లో పడ్డారని తెలుస్తోంది. ఆమెను పారితోషికం విషయంలో ఒప్పించే ప్రయత్నం చేయడంతో పాటు మరో వైపు పవన్‌ కు సరి జోడీ అమ్మాయిని వెదికే పనిలో కూడా ఉన్నారట. వచ్చే నెల మొదట్లోనే సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.
Tags:    

Similar News