ఈ టైటిల్ పారాయణం ఏంది త్రివిక్రమ్?

Update: 2017-04-17 11:58 GMT
అసలు పవర్ స్టార్ తో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా టైటిల్ ఏమయ్యుంటుంది అంటారూ? ఇప్పటివరకు అనేకానేక టైటిల్స్ వినిపిస్తుంటే.. ఏదిపడితే అది సంచలనం అంటున్నారు అభిమానులు. కాని అఫీషియల్ గా వీళ్ళు టైటిల్ చెప్పేవరకు మాత్రం.. అసలు సినిమా ప్రేక్షకులు ఏది ఫైనల్ అనుకోవాలో ఎలా ఊహించుకోవాలో అంటూ తికమక పడుతున్నారు.

మొదట్లో ఈ సినిమాకు ''దేవుడే దిగి వచ్చిన'' అంటూ పేరు పెడుతున్నారని టాక్ వచ్చింది. ఆ తరువాత ఈ మధ్యనే ఈ సినిమా యావత్ సాఫ్టువేర్ కంపెనీ చుట్టూ తిరుగుతుందని రూమర్లు రావడంతో.. ''ఇంజనీర్ బాబు'' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చేసింది. దానికతోడు మనోళ్ళు ఒక కంపెనీ సెట్ ఒకటి వేయడంతో.. ఇదే నిజం అనకున్నారు అందరూ. అయితే ఇప్పుడు కొత్తగా ''పరదేశి పారాయణం'' అంటూ మరో పేరు వినిపిస్తోంది. ఒకవేళ సాఫ్ట్ వేర్ లో పనిచేసేవారందరూ ఫారిన్ వెళ్ళాలనే జపం చేస్తుంటారు అనే ఉద్దేశ్యంతో ఈ పారాయణాన్ని దించారా.. లేకపోతే ఇదే నిజమైన టైటిలా అనే విషయం కూడా ఎవ్వరికీ తెలియదు.

మొత్తానికి త్రివిక్రమ్ మొదలెట్టిన ఈ కొత్త సినిమా గురించి.. అత్తారింటికి దారేది టైటిల్ ను దృష్టిలో పెట్టుకుని.. ఇలా రకరకాలు ఆప్షన్లు రూమర్లుగా వచ్చేస్తున్నాయి. మరి నిజమైన టైటిల్ ఏంటో తెలియాలంటే మాత్రం.. కాస్త వెయిట్ చేయాల్సిందే. ఈ రూమర్ల పారాయణం ఆగాలంటే మాత్రం త్రివిక్రమ్ తొందరపడాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News