మెగా - కొరటాల మూవీ క్యాన్సిల్‌..నిజమెంత?

Update: 2018-12-01 09:42 GMT
మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. చిరు 151వ మూవీ పూర్తి కాకుండానే 152వ చిత్రం గురించి ఆమద్య తెగ చర్చ జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి మూవీ ఉంటుందని - దాన్ని చరణ్‌ నిర్మించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. డిసెంబర్‌ లేదా జనవరిలోనే చిరంజీవి - కొరటాల శివ మూవీ సెట్స్‌ పైకి వెళ్లబోతున్నట్లుగా మెగా వర్గాల నుండి అనధికారిక ప్రకటన వచ్చింది. కాని తాజాగా సినిమా క్యాన్సిల్‌ అయ్యిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుందని - 2020 సంక్రాంతికి కాని సైరా వచ్చే పరిస్థితి లేదంటూ - దాంతో కొరటాలకు చిరంజీవి ఇప్పట్లో డేట్లు ఇచ్చే అవకాశం లేదని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చిరంజీవితో మూవీ ఆలస్యం అవుతున్న కారణంగా మహేష్‌ బాబుతో మూవీ చేయాలని కొరటాల ప్లాన్‌ చేస్తున్నట్లుగా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే మహేష్‌ బాబు కూడా ఖాళీగా ఏమీ లేడు. ప్రస్తుతం తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇక 26వ చిత్రంను సుకుమార్‌ తో చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. కనుక కొరటాల శివకు ఇప్పట్లో మహేష్‌ కూడా డేట్లు ఇచ్చే అవకాశం లేదు.

చిరంజీవి సైరా మూవీ షూటింగ్‌ అనుకున్న టైం కంటే కాస్త ఎక్కువ తీసుకుంటున్న విషయం వాస్తవమే కాని, సినిమా వాయిదా పడటానికి కారణంగా గ్రాఫిక్స్‌ కారణం అంటున్నారు. దాదాపు ఆరు నెలల పాటు గ్రాఫిక్స్‌ వర్క్‌ చేసి, బెస్ట్‌ ఔట్‌ పుట్‌ ను తీసుకు రావాలని భావిస్తున్నారట.

సైరా షూటింగ్‌ ఎప్పుడు పూర్తి అయినా కూడా కొరటాల శివకు వచ్చే ఏడాది ఆరంభంలో చిరంజీవి డేట్లు ఇచ్చే అవకాశం ఉందనిపిస్తోంది. కొరటాల వంటి స్టార్‌ డైరెక్టర్‌ తో సినిమాను మెగా కాంపౌండ్‌ వదులుకోవాలని భావించదు. అందుకే కొరటాల కోరినట్లుగా చిరు కాస్త అటు ఇటుగా డేట్లు ఇచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News