• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రూలర్ ట్రైలర్ కు ముహూర్తం...

రూలర్ ట్రైలర్ కు ముహూర్తం ఖరారు!

By - Tupaki Desk
Update: 2019-12-07 06:36 GMT
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరో గా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రూలర్'. ఈనెల 20 వ తారీఖున 'రూలర్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది 'రూలర్' టీమ్. ఇప్పటికే టీజర్.. పాటను విడుదల చేసిన ఫిలిం మేకర్స్ తాజాగా 'రూలర్' ట్రైలర్ రిలీజ్ చేసేందుకు డేట్.. టైమ్ ఫిక్స్ చేశారు.

నిర్మాతలైన సీకె ఎంటర్టైన్మెంట్స్ వారి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక పోస్టర్ షేర్ చేస్తూ "భారీ యాక్షన్ ధమాకా మీ ముందుకు రానుంది. డిసెంబర్ 8 వ తేదీ ఉదయం 8 గంటల 19 నిముషాలకు రూలర్ ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం" అంటూ సమయం వెల్లడించారు. ఈ సందర్భంగా షేర్ చేసిన పోస్టర్లో బాలయ్య ఐరన్ మ్యాన్ స్టైల్ గడ్డంతో సైడ్ వ్యూలో స్టైలిష్ గా ఉన్నారు. పెయింటింగ్ లా కొన్ని కలర్స్ తో టచ్ ఇవ్వడం తో పోస్టర్ కు ట్రెండీ లుక్ వచ్చింది.

'రూలర్' టీజర్లో బాలయ్య యాక్షన్ అవతారం చూపించిన సంగతి తెలిసిందే. మరి ఈ ట్రైలర్ తో ప్రేక్షకులను బాలయ్య తనదైన శైలిలో మెప్పిస్తారా లేదా వేచి చూడాలి. ఈ సినిమా లో బాల‌య్య జోడీగా వేదిక‌.. సోనాల్ చౌహాన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. భూమిక.. జ‌య‌సుధ‌.. ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్ ప‌తాకం పై నిర్మాత సి.క‌ళ్యాణ్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.


Tags:    
  • Balakrishna movie 
  • Balayya Boyapati Movie Opening 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Telugu Movie News 
  • Ruler Release Date 
  • Ruler Movie Updates 
  • Ruler Talk 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS