• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RRR మ్యూజి‌క్ టీమ్ RR...

RRR మ్యూజి‌క్ టీమ్ RR పనిలోకి దిగారు

By - Tupaki Desk
Update: 2021-04-11 04:51 GMT
ఏదైనా సినిమాకి సంగీతం లేదా రీరికార్డింగ్ ప్రాధాన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. చిన్న బ‌డ్జెట్ చిత్రాల‌కే హాలీవుడ్ రేంజు రీరికార్డింగ్ కావాల‌ని సంగీతం పెద్ద స్థాయిలో ఉండాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఇక ఇటీవ‌ల పాన్ ఇండియా సినిమాల కోసం దేశ విదేశాల నుంచి ప్ర‌తిభావంతులైన సంగీత ద‌ర్శ‌కుల‌ను దిగుమ‌తి చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌రణ ముగింపు ద‌శ‌కు చేరుకోవ‌డంతో ఈ సినిమా రీరికార్డింగ్ సంగీతంపైనా రాజ‌మౌళి దృష్టి సారించార‌ని తెలుస్తోంది.

రాజమౌళి ప్రస్తుతం సినిమా సెట్స్‌కి వెళ్ళకుండా కొంత‌ విరామం తీసుకున్నారు. ప‌నిలో ప‌నిగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ప‌నుల్ని పూర్తి చేస్తున్నారు. తాజాగా యువ బాలీవుడ్ సంగీతద‌ర్శ‌కుడు.. గాయకుడు  పాటల రచయిత విశాల్ మిశ్రా (కబీర్ సింగ్ ఫేం) ట్విట్టర్ ‌లో జ‌క్క‌న్న‌తో క‌లిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో రాజ‌మౌళితో పాటు సంగీత స్వరకర్త కీరవాణి ఉన్నారు. ``మేం ఈ రోజు స్టూడియోలో మ్యాజిక్ చేసాం. R.R.R త్వరలో వస్తుంది`` అని విశాల్ చేసిన ట్వీట్ తో ఇటీవ‌లి ర‌క‌ర‌కాల ప్ర‌చారానికి చెక్ పెట్టిన‌ట్ట‌య్యింది. ప్ర‌స్తుతానికి ఆర్.ఆర్.ఆర్ కి పాట‌ల ప‌ని అలాగే రీరికార్డింగ్ ప‌నులు సాగుతున్నాయ‌ని దీనిని బ‌ట్టి క్లారిటీ వ‌చ్చేసింది.

ఇక‌పోతే సోష‌ల్ మీడియాల్లో ఆర్.ఆర్.ఆర్ చెప్పిన టైమ్ కి రావ‌డం లేద‌ని వాయిదా ప‌డింద‌ని ప్ర‌చార‌మైపోతోంది. దీంతో అక్టోబ‌ర్ లో ఈ సినిమా రిలీజ్ కాదా? అన్న సందేహాల్ని అభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు. కానీ ఈ వాయిదాపై చిత్ర‌బృందం అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ప్ర‌స్తుతం జ‌క్క‌న్న స్పీడ్ చూస్తుంటే చెప్పిన టైమ్ కి రిలీజ్ చేయ‌డ‌మే ధ్యేయంగా ప‌ని చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.  ఎన్టీఆర్- రామ్ చరణ్- అజయ్ దేవ్‌గన్ - అలియా భట్- ఒలివియా మోరిస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. అక్టోబర్ 13 న దాసర కానుక‌గా సినిమా రిలీజ్ కానుంది.
Tags:    
  • RRR Shooting 
  • Rajamouli 
  • RRR 
  • Ram Charan 
  • Ntr 
  • Alluri Seetharamaraju 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS