స్టార్ హీరోయిన్ తో హీరోగారి ఎఫైర్ గుట్టు లీక్!
మాజీ ప్రపంచ సుందరి.. అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రాతో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఎఫైర్ పై బాలీవుడ్ మీడియాలో వేడెక్కించే కథనాలొచ్చాయి. అప్పట్లో ఇది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒక దశలో గౌరీ ఖాన్ కి విడాకులిచ్చేందుకు షారూక్ సిద్ధమయ్యారని కూడా బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపించాయి.
అంతేనా.. ప్రియాంక చోప్రాని షారూక్ రహస్యంగా పెళ్లాడేసారని కూడా కథనాలు రావడం సంచలనమైంది. అయితే ఆ తర్వాత వాటన్నిటి నుంచి ఆయన ఎలా బయటపడ్డారో కానీ.. నిజానికి షారూక్ నుంచి పీసీ పూర్తిగా దూరమైపోవడానికి బాలీవుడ్ మీడియా ఆగడాలే కారణమని ప్రచారమైంది.
ఆ కథనాల నేపథ్యంలో అసలు షారూక్ తో పీసీ మాట్లాడడమే మానేసానని తెలిపింది. కాఫీ విత్ కరణ్ షోలో ఇదే ప్రశ్నను సంధించగా.. ప్రేమను కన్ఫామ్ చేయని పీసీ ఎంతో నర్మగర్భంగా మాట్లాడింది. ఆ రెండిటి నడుమా అంతకుమించి ఇంకేదో జరిగింది! అన్నట్టుగా క్లూ ఇచ్చింది పీసీ. ఇకపోతే షారూక్ అదే పనిగా పీసీతో కలిసి చెట్టాపట్టాల్ అంటూ పబ్లిక్ వేదికలపై పదే పదే కనిపిస్తుండడంతోనే బాలీవుడ్ మీడియా కూడా నోరు కట్టేసుకోలేకపోయింది. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ వివాదం నుంచి బయటపడి ఖాన్ సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత పీసీ స్టార్ హీరోయిన్ గా తన లెగసీని కంటిన్యూ చేసింది. ఇప్పుడు అమెరికన్ నటుడు కం సింగర్ నిక్ జోనాస్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిలైంది. అటు హాలీవుడ్ లోనూ నటించాలన్న తన తృష్ణను తీర్చుకుంటోంది. భవిష్యత్ లో నిర్మాతగానూ రాణించేందుకు రంగం సిద్ధం చేసింది. ఒక సాధారణ యువతి మిస్ వరల్డ్ గా ఎంపికవ్వడం అటుపై ఇంత పెద్ద జర్నీ చేయడం ఎంతో గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక షారూక్ కెరీర్ జర్నీలో జూహీ చావ్లాతోనూ ఎఫైర్ ఉందన్న ప్రచారం సాగింది. కానీ ఆ ఇద్దరూ వ్యాపార భాగస్వాములుగా కొనసాగడంతోనే ఆ ప్రచారం సాగిందా? అన్నదానికి సరైన క్లారిటీ లేదు. రియల్ లైఫ్ రీల్ లైఫ్ రెండిటా రొమాంటిక్ హీరోగా వెలిగిపోయిన షారూక్ ఇప్పటికీ యువతుల గుండెల్లో మారాజుగానే కొనసాగుతున్నాడు. .. 55 వయసులోనూ..!