మాజీ భర్త.. ఫ్యాన్స్.. అనలేదే
మళ్లీ పెళ్లి చేసుకోవడం అనే టాపిక్ పై రేణూ దేశాయ్ రియాక్ట్ అయినప్పటి నుంచి.. ఆమె పై ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసేస్తున్నారు. అలాగని ఇలాంటి వాటిని వేడుక చూస్తూ కూర్చునే టైపు కాదు రేణు. ఓ వ్యక్తి అయితే.. "మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటే నేను చచ్చినంత ఒట్టు" లాంటి కామెంట్ పెడితే.. దానికి పర్సనల్ గా కూడా రియాక్ట్ అయిన రేణూ దేశాయ్.. తాను ఆ అభిప్రాయాన్ని మహిళలు అందరినీ ఉద్దేశించి చేసినది మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. అయినాసరే.. ఈ దాడి ఆగలేదు. దీంతో మరోసారి సుదీర్ఘమైన వివరణ ఇచ్చింది రేణూ దేశాయ్.
'నిన్న నేను ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎక్కడా నా మాజీ భర్త అని కానీ.. ఫ్యాన్ అనే పదం కానీ వాడలేదు. మీడియా కొందరు వ్యక్తులు కలిసి నన్ను పవన కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి వ్యతిరేకంగా మారుస్తున్నారు. నేను చాలా క్లియర్ గా రాశాను. ఈ పోస్ట్ నా పర్సనల్ ఇష్యూ గురించి కాదు. ఈ దేశ పౌరిరాలిగా కేవలం సామాజిక ఆలోచనను మాత్రమే చెప్పాను. ఈ ఇష్యూను ఓ మహిళ స్వేచ్ఛ.. విద్య.. ఆరోగ్యం గురించి తీసుకోండి. మీ అందరికీ అమ్మ.. అక్క.. చెల్లి ఉన్నారు. ఇది నా కోసం కాదు. వాళ్ల కోసం చేయండి. వారు చదువుకునేందుకు.. పని చేసేందుకు.. వారికి ఎమోషనల్ ఫ్రీడం ఇచ్చేందుకు ప్రయత్నించండి. దయచేసి మీడియా ఛానల్స్ కూడా పాజిటివిటీని పంచేందుకు ప్రయత్నించండి' అంటూ విన్నవించింది రేణూ దేశాయ్.
పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఇన్నేళ్లలో ఎప్పుడూ పవన్ గారు.. పవన్ కళ్యాణ్ గారు అని మాత్రమే సంబోధిస్తుంది రేణూ దేశాయ్. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ రచ్చ కారణంగా.. ఆమె 'మై ఎక్స్ హజ్బెండ్' అనే పదాన్ని వాడిందని.. ఆమె ఎంతగా హర్ట్ అయి ఉంటుందోనని కొందరు నెటిజెన్స్ కామెంట్స్ చేసుకుంటున్నారు.