తెలుగు సినిమాకి వారి కొరత

Update: 2017-05-29 17:30 GMT
ప్రస్తుతం స్టోరీ రైటర్స్.. దర్శకులుగా మారే ట్రెండ్ బాగా ఊపందుకుంది. ఆయా స్టార్లు.. హీరోలకు తగినట్లుగా కథా రచన చేయగల సత్తా ఉన్న రైటర్లు.. సొంత దర్శకత్వంలో సినిమాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు డైరెక్టర్లుగా మారిపోగా.. మరికొంత మంది ఇదే రూట్ లో ఉన్నారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు రచయితలకు.. కథలకు కొరత ఎదుర్కోవాల్సి వస్తోంది.

కొరటాల.. అనిల్ రావిపూడి.. వక్కంతం వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే ఉంటుంది. వీరికి ఇప్పుడు బీవీఎస్ రవి.. గోపీ మోహన్.. రాజమౌళి సోదరుడు ఎస్ ఎస్ కాంచి.. శ్రీధర్ సీపాన వంటి రచయితలు దర్శకులు మారుతున్నారు. ఒకేసారి ఇంతమంది అనుభజ్ఞులైన రైటర్స్ రచనకు దూరం కావడంతో.. స్టార్స్ కు స్క్రిప్ట్ లు దొరకడం కష్టమైపోతోంది. ఎన్టీఆర్- వివి వినాయక్ కలిసి పని చేసేందుకు సిద్ధం అని ఎప్పుడో ప్రకటించారు. నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేయనున్నారు. కానీ ఇప్పటివరకూ ఇది పట్టాలెక్కకపోవడానికి కారణం కథ లేకపోవడమే.

ఖైదీ నంబర్ 150 చేసేందుకు ముందు చిరంజీవి ఏడాదిన్నరకు పైగా కథ కోసం వెతుక్కున్నారు. కథా రచయితల కొరతను బాహాటంగానే చెప్పారు. గురు తర్వాత వెంకటేష్ ఇప్పటికీ ఒక్క సినిమాకి కూడా సైన్ చేయకపోవడానికి కారణం ఇదే. రవితేజ ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకుని.. రైటర్ కం డైరెక్టర్ అనిల్ రావిపూడితోనే జట్టు కట్టాడు. పవన్- మహేష్ లాంటి స్టార్ హీరోలంతా రైటర్ కం డైరెక్టర్లకే మొగ్గు చూపడానికి కారణం ఇదే అని చెప్పచ్చు. మరి ఈ రచయితల కొరత నుంచి టాలీవుడ్ తప్పించుకోవాలంటే.. అయితే కొత్త రక్తం రావాలి.. లేదా ఉన్న దర్శకులే పెన్-పేపర్ పట్టుకోవాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News