ముందు వెనుక తరాలతో మాస్ మహరాజ్

Update: 2017-02-19 06:27 GMT
రవితేజ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉండడంలో ఏ మాత్రం ఆశ్చర్యపోవాల్సిన పని ఉండదు. ఏడాది పాటు ఒక్క సినిమా కూడా మొదలుపెట్టకపోవడంతో రకరకాల పుకార్లు ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పేస్తూ ఒకేసారి రెండు సినిమాలు స్టార్ట్  చేసేశాడు మాస్ మహరాజ్.

టచ్ చేసి అంటూనే.. రాజా ది గ్రేట్ అని కూడా చెప్పేస్తున్నాడు. రెండు వారాలుగా మళ్లీ షూటింగ్ స్పాట్ లో ఎనర్జీ ఎంజాయ్ చేసిన రవితేజ.. ఇప్పుడు ఆదివారాన్ని ఫ్యామిలీతో కలిసి గడుపుతున్నాడు. తను ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నాడో.. ఇవాళ తనకు ఎంత స్పెషల్ అనే విషయం చెప్పేందుకు ఓ ఫోటోను ఫేస్ బుక్ లో పెట్టాడు రవితేజ. ఇందులో రవితేజ తండ్రితో పాటు.. కొడుకు కూడా ఉండడం విశేషం. ఒకేసారి తమ వంశంలోని 3 తరాలను చూపించి ఆశ్చర్యపరిచాడు. రవితేజ ఫాదర్ పేరు భూపతి రాజ్ గోపాల్ రాజు అయితే.. కొడుకు పేరు మహాధన్ భూపతి రాజు.

'మూడు తరాలు..  కుటుంబంతో అనుబంధం.. అటు తండ్రి.. ఇటు కొడుకు.. హ్యాపీ సండే' అంటూ పోస్ట్ చేశాడు మాస్ మహరాజ్. సాధారణంగా తన ఫ్యామిలీ పిక్స్ పోస్ట్ చేయని రవితేజ.. ఇలా ఒకేసారి మూడు తరాలను చూపించడంతో.. ఫ్యాన్స్ భలే ఖుషీ అయిపోతున్నారు. రవితేజ పోస్ట్ చేసిన 3 జనరేషన్స్ ఫోటో ఇప్పుడు ఆన్ లైన్ లో తెగ షేర్ అయిపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News