ప్రభాస్..డార్లింగ్ అని ఎందుకు పిలవలేదు?
పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం తన క్రేజ్‌కి తగ్గట్టుగా భారీ పాన్ ఇండియా మూవీస్‌ని ఎంచుకుంటూ గతం కంటే భిన్నంగా క్షణం తీరిక లేకుండా వరుస షూటింగ్‌లలో ఆల్గొంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు;
పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం తన క్రేజ్‌కి తగ్గట్టుగా భారీ పాన్ ఇండియా మూవీస్‌ని ఎంచుకుంటూ గతం కంటే భిన్నంగా క్షణం తీరిక లేకుండా వరుస షూటింగ్‌లలో ఆల్గొంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. `బాహుబలి`కి ముందు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే అంగీకరిస్తూ వస్తున్న డార్లింగ్ దీని తరువాత నుంచి తన పంథా మార్చుకున్నాడు. తనకున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని బ్లాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఫౌజీ, స్పిరిట్, కల్కి 2898ఏడీ సీక్వెల్‌తో పాటు మారుతి డైరెక్షన్‌లో కామెడీ థ్రిల్లర్ `ది రాజా సాబ్` చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న ఈ మూవీ జనవరి 9న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌ని టీమ్ ఇప్పటికే మొదలుపెట్టింది. దీని తరువాత ప్రభాస్ సంచలన డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ డైరెక్షన్‌లో `స్పిరిట్` మూవీ చేస్తున్నాడు. రా పోలీస్ ఆఫీసర్‌గా ఫస్ట్ టైమ్ ప్రభాస్ ఇందులో నటిస్తున్నాడు.
దీనికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలైంది. `యానిమల్` ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో కాంచన, ప్రకాష్ రాజ్, వివేక్ ఓబెరాయ్ నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదల చేసిన డైలాగ్ ప్రోమో సినిమాపై అంచనాల్ని పెంచేసింది. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి `అర్జున్‌రెడ్డి`, `యానిమల్` ఫేమ్ హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది.
మ్యూజిక్ వర్క్‌ని కూడా ఇటీవలే పూర్తి చేసి షూటింగ్ మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 25 గురువారం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హీరో ప్రభాస్ ఇన్ స్టా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేశారు. `పుట్టిన రోజు శుభాకాంక్షలు బ్రో.. నువ్వు సృష్టిస్తున్న దానిని అందరూ చూడటం కోసం వేచి ఉండలేకపోతున్నాను` అంటూ స్పందించారు. ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభాస్ ఎవరిని సంబోధించిన తన ఊతపదం వాడుతూ డార్లింగ్ అని పిలవడం అలవాటు. ఇది ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే. ఇండస్ట్రీలో రాజమౌళి నుంచి ప్రతి ఒక్కరినీ డార్లింగ్ అని సంబోధించే ప్రభాస్ డైరెక్టర్ సందీప్ వంగ విషయంలో మాత్రం డార్లింగ్‌కు బదులు బ్రో అనే పదం వాడటం అందరిని షాక్‌కు గురి చేస్తోంది. ప్రస్తుతం దీనిపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. సందీప్ వంగ పనితీరుకు రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్ తనని బ్రదర్ అని సంబోధించాడా? లేక తన పంథాని మార్చుకుని అలా పిలిచాడా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.