భ‌ర‌త్ గురించి ఓపెన్ అయిన ర‌వితేజ‌

Update: 2017-07-02 06:47 GMT
స‌రిగ్గా వారం క్రితం ప్ర‌ముఖ సినీన‌టుడు ర‌వితేజ సోద‌రుడు.. న‌టుడు భ‌ర‌త్ కారు యాక్సిడెంట్లో మ‌ర‌ణించ‌టం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం సంద‌ర్భంగా చోటు చేసుకున్న ప‌రిణామాలు సంచ‌ల‌నంగా మారితే.. పోస్ట్ మార్టం త‌ర్వాత ఆసుప‌త్రి నుంచి ఆయ‌న్ను నేరుగా మ‌హాప్ర‌స్థానం శ‌శ్మాన వాటిక‌కు త‌ర‌లించ‌టం.. ర‌వితేజ హాజ‌రు కాక‌పోవ‌టం లాంటివి పెద్ద చ‌ర్చ‌నీయాంశాలుగా మారాయి.

అదే రోజు రాత్రి సోష‌ల్ మీడియాలో ఒక వార్త ప్ర‌ముఖంగా వైర‌ల్ అయ్యింది. భ‌ర‌త్ అంత్యక్రియ‌ల్ని ఎవ‌రో జూనియ‌ర్ అర్టిస్ట్ చేత చేయించార‌ని ఆ వ్య‌క్తికి రూ.1500 ఇచ్చిన‌ట్లుగా ఉంది. ఈ వ్య‌వ‌హారం ఇలా ఉన్న వేళ‌.. త‌ర్వాతి రోజు ర‌వితేజ షూటింగ్‌కు హాజ‌ర‌య్యారంటూ వార్త వ‌చ్చింది. నిజానికి ఇందులో నిజాలు ఎన్ని? అబ‌ద్ధాలు ఎన్ని? బ‌య‌ట‌కు వినిపించిన మాట‌ల‌కు.. నిజంగా ఏం జ‌రిగింద‌న్న విష‌యాన్ని ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ర‌వితేజ ఓపెన్ అయ్యారు.

మూడ్ బాగోలేదు.. ఇప్పుడు ఇంట‌ర్వ్యూ వ‌ద్ద‌న్న ర‌వితేజ‌.. జ‌రిగిన ప్ర‌చారంలో నిజం కంటే అబ‌ద్ధం ఎంత‌న్న విష‌యాన్ని చెప్పుకొచ్చారు. ఆ ఇంట‌ర్వ్యూలో ర‌వితేజ ఏం చెప్పార‌న్న‌ది చూస్తే..

 అంత్య‌క్రియ‌ల‌కు వెళ్ల‌క‌పోవ‌టంపై..

చెబితే న‌మ్మ‌రు కానీ.. సోష‌ల్ మీడియాలో కానీ టీవీలో కానీ భ‌ర‌త్ యాక్సిడెంట్ ఫోటోల‌ను చూడ‌లేదు. మేం ఎందుకు చూడ‌లేదంటే భ‌ర‌త్ మా ఊహాల్లో హ్యాపీగా నిలిచిపోయాడు. మాకెప్ప‌టికీ అలా గుర్తిండిపోవాల‌ని అనుకున్నాం. ప్ర‌తి మ‌నిషికి ఒక ఫోబియా ఉంటుంది. చ‌నిపోయిన వాళ్ల‌ను నేను చూడలేను. భ‌యంగా ఉంటుంది. మీరు గ‌మ‌నిస్తే..  సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రైనా చ‌నిపోయిన‌ప్పుడు చూడ్డానికి వెళ్లిన వారిలో నేను క‌నిపించ‌ను.

ఆ త‌ర్వాత వెళ్లి వారి కుటుంబ స‌భ్యుల్ని ప‌లుక‌రిస్తుంటా. శ్రీహ‌రి చ‌నిపోయిన‌ప్పుడు గుండెల్లో ధైర్యం కూడ‌గ‌ట్టుకొని వెళ్లా. ఆయ‌న ఇంటి స‌మీపంలోకి కారు వెళ్లిన స‌మ‌యానికి నాకు ఏదోలా అయిపోయింది. గుండెలో ద‌డ మొద‌లైంది. చూడ‌కుండా వెన‌క్కి వ‌చ్చేశాను. ఆ వీక్‌నెస్ నాకు తెలిసిన వారికే తెలుసు. తెలిసిన వాళ్ల‌నే చూడ‌లేని వాడిని.. నా త‌మ్ముడ్ని చూడ‌గ‌ల‌నా? ఎంత సినిమా యాక్ట‌ర్ల‌మైనా.. మాకుండే ఎమోష‌న్స్ మాకుంటాయి. అవేమీ తెలుసుకోకుండా నింద‌లు వేయ‌టం బాధాక‌రం.

ఎవ‌రితోనో భ‌ర‌త్ అంత్య‌క్రియ‌లు చేశార‌ని..

ఎంత దారుణమండీ. మా తమ్ముడి చివరి కార్యక్రమాలను అపరిచితులతో చేయించాల్సిన ఖర్మ మాకేంటండీ? నేను మా అమ్మానాన్నల దగ్గరుండిపోయా. రఘు చేత చేయించకూడదన్నారు. అందుకని మా బాబాయ్‌ (రవితేజ తల్లి సోదరి భర్త)తో అంత్యక్రియలు చేయించాం. ఆయనెవరో బయట జనానికి తెలియదు. కానీ, ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. భ‌ర‌త్ను అనాథ‌లా పంపామంటూ మ‌మ్మ‌ల్ని అవ‌మానించారు. మా గురించి స‌రే.. చ‌నిపోయిన మ‌నిషిని కించ‌ప‌రిచేలా కామెంట్లు చేయ‌కూడ‌దు క‌దా?

ప‌క్క‌రోజే షూటింగ్‌కు వెళ్లార‌న్న విమ‌ర్శ‌ల‌పై..

సోష‌ల్ మీడియాల చాలా ర‌కాలుగా రాశార‌ని విన్నా. (ఇంట‌ర్వ్యూ జ‌రిగిన స‌మ‌యానికి షూటింగ్ లొకేష‌న్లో ఉన్న ఆర్టిస్టులు.. సిబ్బందిని చూపిస్తూ) ఇప్పుడు లొకేష‌న్లో ఉన్న వారి కంటే రెట్టింపు ఆ రోజు కాల్షీట్లు తీసుకున్నాం. సినిమా అనేది కోట్ల రూపాయిల‌తో ముడిప‌డి ఉన్న‌ది. అంత‌మంది డేట్లు అడ్జెస్ట్ చేసి షూటింగ్ చేయ‌టం అంత ఈజీ కాదు. నా కార‌ణంగా షూటింగ్ ఆగి.. నిర్మాత‌కు న‌ష్టం జ‌ర‌గ‌టం నాకిష్టం ఉండ‌దు. అందుకే.. మ‌న‌సులో ఎలా ఉన్నా.. షూటింగ్ చేశా.అంతేకానీ ఆనందంగా వెళ్ల‌లేదు.

భ‌ర‌త్‌.. మీకూ మాట‌ల్లేవ‌ని.. మీకు దూరంగా ఉంటార‌ని..

ఈ మాట‌ల్లో కూడా నిజం లేదు. నాలుగు రోజ‌ల ముందే భ‌ర‌త్ బ‌ర్త్ డే మా ఇంట్లోనే చేసుకున్నాం. బ‌ర్త్ డే కేక్‌క‌ట్ చేయ‌టం భ‌ర‌త్ కు ఇష్టం ఉండ‌దు. కానీ.. ఆ రోజు మాత్రం.. కేక్ క‌ట్ చేస్తాన‌న్నాడు. చాలా సంద‌డి చేశాడు. చాలా హ్యాపీగా గ‌డిపాం. నేనూ.. ఆ అమ్మా..నాన్నా ఆ భ‌ర‌త్‌నే గుర్తు పెట్టుకోవాల‌ని అనుకున్నాం.

భ‌ర‌త్ తో మీ పిల్ల‌లు ఎలా ఉంటారు?

నాకిద్ద‌రు. న‌న్ను పిలిచిన‌ట్లే.. నా త‌మ్ముళ్ల‌ను నాన్న అని పిలుస్తారు. భ‌ర‌త్ చ‌నిపోడ‌ని తెలిసి పిల్ల‌లు ఇద్ద‌రూ బాగా ఏడ్చారు. వాళ్ల‌ను ఓదార్చ‌టం మా వ‌ల్ల కాలేదు. వాళ్ల‌కు వాళ్ల బాబాయ్ అంటే అంతిష్టం. అదేంటో.. ఆ లారీ రోడ్డు మీద బ్రేక్ డౌన్ కావ‌టం. దాన్ని తీయ‌క‌పోవ‌టం చూస్తే.. మా వాడి ప్రాణాల కోస‌మే లారీ బ్రేక్ డౌన్ అయిన‌ట్లు అనిపిస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News