వరుస ఫ్లాపులతో రవితేజ సంచలన నిర్ణయం

Update: 2020-02-29 07:15 GMT
రవితేజ.. క్యారెక్టర్ ఆర్టిస్టు గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేశారు. అయితే మూస సినిమాలతో వరుస ఫ్లాపులు తెచ్చుకుంటూ వెనకబడి పోతున్నారు. ‘రాజా ది గ్రేట్’ తర్వాత సరైన హిట్ లేక వరుసగా విఫలమవుతున్నారు.

ప్రస్తుతం హిట్ కోసం రవితేజ చకోర పక్షిలా ఎదురు చూస్తున్నారు. తాజాగా తీసిన ‘డిస్కో రాజా’ మూవీ కూడా నిరాశ పరిచింది.

దీంతో రవితేజ తన రూటు మార్చాలని డిసైడ్ అయ్యారు. మాస్ , యాక్షన్ స్టోరీలను తగ్గించి మంచి కామెడీ కంటెంట్ మూవీలనే తీయడం బెటర్ అని దాదాపు నిర్ణయానికి వచ్చాడట..

తాజాగా గోపిచంద్ మలినేనితో రవితేజ సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమాకు ‘క్రాక్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో ఫుల్ కామెడీ ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నాడట..

ఈ సినిమా తర్వాత ఇక మాస్, యాక్షన్ కు తిలోదకాలు ఇచ్చేసి ఫుల్ కామెడీ స్క్రిప్ట్ లే తీయాలని డిసైడ్ అయ్యాడట.. ఈ తరువాత త్రినాథ్ నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా ఒప్పుకున్నారు. ఆ సినిమా కూడా ఫుల్ కామెడీ బేస్ అట.. ఇలా తన పంథా మార్చుకున్న రవితేజ కు హిట్ దక్కుతాయో లేదో చూడాలి మరీ..
Tags:    

Similar News