నాని ఇరికించి ఎస్కేప్ అయ్యాడా?

Update: 2020-02-29 06:15 GMT
మాస్ మ‌హారాజా ర‌వితేజకు స‌క్సెస్ అంద‌ని ద్రాక్ష‌నే అయ్యింది. దానికోస‌మే ఏళ్ల‌కు ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. కొన్నేళ్లుగా ఆవురావురుమంటూ ఉన్నాడు. ఒక‌ర‌క‌మైన‌ ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇటీవ‌లే విడుద‌లైన `డిస్కోరాజా` కూడా తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. ఇక‌నైనా రూట్ మారుతుందా? రాబోవు సినిమా అయినా హిట్ట‌వుతుందా? అన్న‌దే స‌స్పెన్స్. ఇప్ప‌టికే రాజా మార్కెట్  పై ఫ్లాపుల‌ ప్ర‌భావం గ‌ట్టిగానే ఉంది. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలోని క్రాక్ అన్నిటినీ మార్చాల్సి ఉంటుంది. ఈ మూవీ ప‌క్కా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ . మ‌సాలా డైరెక్ట‌ర్ గోపీ చంద్ మ‌లినేని ఈసారి రియ‌లిస్టిక్ క‌థ‌తో పూర్తిగా కొత్త పంథాలో వెళుతున్నాడు. ఇటీవ‌లే విడుద‌లైన యాక్ష‌న్ టీజ‌ర్ ఫ‌ర్వాలేద‌నిపించింది. మాస్ రాజా ఈసారి కొట్టేస్తాడా అంటూ అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

ఇక ఈ సినిమా అనంత‌రం మాస్ రాజా ఓ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌ను లాక్ చేశాడ‌ట‌ట‌. ర‌మేష్ వ‌ర్మ ... త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలోనూ సినిమాల‌కు క‌మిట‌య్యాడ‌ట‌. ఇక త్రినాథ‌రావు క‌థ‌ను రవితేజ‌కు నానీ సిఫార‌సు చేశార‌ని తెలుస్తోంది. ర‌వితేజ ప్ర‌స్తుత‌ పరిస్థితి చూసి చ‌లించి పోయాడా లేక‌ త‌న‌కెందుకులే అని భావించాడో తెలియ‌దు గానీ నేచుర‌ల్ స్టార్ నాని త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన స్క్రిప్టునే ర‌వితేజ వైపుకు మ‌ళ్లించాడ‌న్న టాక్ వినిపిస్తోంది. ర‌వితేజ‌కు అయితే బాగుంటుంద‌ని త్రినాథ‌రావును త‌న వ‌ద్ద‌కు పంపాడ‌ట‌. క‌థ విన్న ర‌వితేజ ఈ స్క్రిప్ట్ పై అపార న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసాడుట‌. క‌చ్ఛితంగా మ‌న‌మిద్ద‌ర‌మే చేద్దాం అంటూ ప్రామిస్ చేసాడుట‌.

వ‌చ్చే ఏడాది ఆ సినిమా సెట్స్ కు వెళ్ల‌నుంద‌ని అంటున్నారు. పీపూల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొచ్చిందిట‌. ఇక త్రినాధ‌రావు విష‌యానికి వ‌స్తే నేను లోక‌ల్- సినిమా చూపిస్త మావ చిత్రాల‌ తో హిట్లు కొట్టాడు. గ‌తేడాది సినిమా లేకుండా ఖాళీగానే ఉన్నాడు. మ‌ధ్య‌లో ఒక సినిమా చేసాడు గానీ అది ప్లాప్ అయింది. ఈ నేప‌థ్యంలో `నేను లోక‌ల్ `తో నానికి హిట్టు ఇచ్చాడ‌న్న న‌మ్మ‌కంతో మ‌రోసారి నాని ని అప్రోచ్ అయితే ఇలా ట‌ర్న్ తిప్పేశాడ‌ట‌. మ‌రి నాని నిజంగా ఆ స్క్రిప్ట్ త‌న‌కి స‌రిప‌డ‌ద‌ని ర‌వితేజ వైపు మ‌ళ్లీంచాడా? లేక కాల్షీట్ల స‌మ‌స్య వ‌ల్ల‌నే ఇలా చేశాడా? ఇంకేవైనా కార‌ణాలు ఉన్నాయా? అన్న‌ది తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News