సినిమావాళ్ల‌కు సీఎం కేసీఆర్ వరాలే వ‌రాలు

Update: 2020-11-23 10:10 GMT
ఎన్నిక‌ల్లో హామీలు వ‌రాల జ‌ల్లుల గురించి ప్ర‌త్యేకించి చెప్పాలా?  కొండ‌మీది కోతిని తెచ్చి ఇంట్లో క‌ట్టేస్తారు!  నేత‌ల మాట‌లు కోట‌లు దాటుతుంటాయి. అదేమో కానీ.. ఉన్న‌ట్టుండి సినిమావాళ్ల‌కు వ‌రాల జ‌ల్లు కురిపించి తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ గా మారారు.

గ‌త కొంత‌కాలంగా సినీప‌రిశ్ర‌మ పెద్ద‌లు కేసీఆర్ ని క‌లిసి మంత‌నాలు సాగిస్తున్నారు. క‌రోనా క్రైసిస్ వ‌ల్ల ప‌రిశ్ర‌మ ఎంత‌గా న‌ష్ట‌పోయిందో ఆయ‌న‌కు నూరిపోసారు. ప‌ర్య‌వ‌సానంగా కేసీఆర్ నుంచి వ‌రాల జ‌ల్లు కురిసింది. ఈ క్రైసిస్ లో దాదాపు 40వేల మంది సినీకార్మికుల‌కు ఉపాధి లేకుండా పోయింద‌ని వారంద‌రినీ ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు సీఎం. అలాగే వీరంద‌రికీ రేష‌న్ కార్డులు.. హెల్త్ కార్డులు ఇస్తామ‌ని ప్రామిస్ చేశారు.

చిన్న సినిమాల‌పై వేలాది మంది కార్మికులు.. జూనియ‌ర్ ఆర్టిస్టులు ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. అందుకే 10 కోట్ల లోపు బ‌డ్జెట్ తో నిర్మించే సినిమాల‌కు జీఎస్టీని మిన‌హాయిస్తున్నాం. మార్చి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 9 శాతం ప‌న్ను ర‌ద్దు చేస్తున్నాం అని తెలిపారు. అలాగే థియేట‌ర్లు తెర‌వ‌క యాజ‌మాన్యాలు తీవ్రంగా న‌ష్ట‌పోయాయ‌ని.. వారికి క‌నీస మెయింటెనెన్స్ చెల్లింపు అలాగే.. క‌రెంట్ బిల్లులు రీఇంబ‌ర్స్ మెంట్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. సినీపెద్ద‌లు నిన్న కూడా త‌న‌ని క‌లిసార‌ని అన్నీ విన్నాన‌ని కేసీఆర్ అన్నారు. హైద‌రాబాద్ లో టాలీవుడ్ ఇండియాకి ఫిలింహ‌బ్ అవుతుంద‌ని కేసీఆర్ అన్నారు. త్వ‌ర‌లోనే సినీపెద్ద‌ల‌తో ఈ విష‌యంపై మ‌రోసారి క‌లుస్తాన‌ని కూడా ప్రామిస్ చేశారు. మొత్తానికి ముఖ్య‌మంత్రి మాట‌లు చూస్తుంటే టాలీవుడ్ కి చాలా చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే జ‌మానా కాలంలో ప్ర‌క‌టించిన హైద‌రాబాద్ లో పూణే త‌ర‌హా ఫిలింఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు మోక్షం క‌లిగేదెపుడో మాత్రం చెప్ప‌లేదు.
Tags:    

Similar News