ఆన్‌ స్క్రీన్‌ ఎన్టీఆర్‌ ను పరిచయం చేసిన వర్మ

Update: 2019-03-23 09:20 GMT
రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనమే అనే విషయం మరోసారి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంతో నిరూపితం అయ్యింది. తాను ఏ సినిమా చేసినా కూడా అందులోని పాత్రలను పూర్తిగా యాప్ట్‌ అయ్యేలా తీసుకుంటాడు వర్మ. ముఖ్యంగా రియల్‌ లైఫ్‌ సంఘటనలు, బయోపిక్‌ లు తీసే సమయంలో ఆ పాత్రలకు పూర్తిగా జీవం పోసినట్లుగా వర్మ రూపొందిస్తాడు. ప్రతి సినిమాలో కూడా వర్మ పాత్రల విషయంలో చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. రక్తచరిత్ర - సర్కార్‌ - కిల్లింగ్‌ వీరప్పన్‌ ఇలా ప్రతి సినిమాలో కూడా పాత్రలను చూస్తే నిజంగా నిజ జీవిత పాత్రలను చూసినట్లుగానే అనిపిస్తుంది. తాజాగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో నటించిన ఎన్టీఆర్‌ పాత్రధారిని చూసినా కూడా ఔరా అనిపించక మానదు.

క్రిష్‌ 'ఎన్టీఆర్‌' చిత్రంలో బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషించాడు. కొన్ని సీన్స్‌ లో మినహా ఎక్కువ శాతం ఆకట్టుకున్నాడు. అయితే కొందరు మాత్రం ఎన్టీఆర్‌ ను చూడలేక పోతున్నాం, బాలకృష్ణ కనిపిస్తున్నాడు అంటూ విమర్శలు చేశారు. అయితే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో మాత్రం ఎన్టీఆర్‌ పాత్రలో నటించిన నటుడు ఎవరో తెలియని కారణంగా ఎన్టీఆర్‌ మాత్రమే కనిపిస్తున్నాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది. ఎన్టీఆర్‌ పాత్ర పోషించిన వ్యక్తి గురించి మొదటి నుండి పెద్దగా చెప్పని వర్మ తాజాగా సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ నటుడిని పరిచయం చేశాడు.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్ర కోసం చాలా మందిని వెదికిన తర్వాత రంగస్థల నటుడు అయిన విజయ్‌ కుమార్‌ కనిపించారు. ఆయనకు రెండు నెలలు శిక్షణ ఇచ్చిన తర్వాత సినిమాను ప్రారంభించడం జరిగింది అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం కోసం పరిచయం లేని నటుడిని తీసుకోవాలని భావించాను. అందుకే ఆయన్ను తీసుకున్నట్లుగా వర్మ పేర్కొన్నాడు.

ఇక ఈ చిత్రం విడుదల విషయంలో సెన్సార్‌ క్లియరెన్స్‌ ఇంకా రాలేదనే వార్తలపై వర్మ స్పందించాడు. తమ సినిమాకు సెన్సార్‌ అయ్యిందని - ముందు నుండి అనుకుంటున్నట్లుగా 29వ తారీకున సినిమాను విడుదల చేస్తామని వర్మ మరోసారి ప్రకటించాడు. 


Full View
Tags:    

Similar News