ఫుల్ క్లారిటీ: బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 ఫైనలిస్ట్ లు వీరే

దగ్గర దగ్గర మూడునెలలకు పైనే సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రియాల్టీ షో ముగింపు దశకు చేరుకుంది.;

Update: 2025-12-15 04:34 GMT

దగ్గర దగ్గర మూడునెలలకు పైనే సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రియాల్టీ షో ముగింపు దశకు చేరుకుంది. మరో వారంలో బిగ్ బాస్ సీజన్ 9 విజేత ఎవరన్నది తేలనుంది. దీనికి సంబంధించి తాజాగా టాప్ 5 ఫైనలిస్ట్ లు ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ఈ రియాల్టీ షోలో చోటు చేసుకునే పరిణామాలు ఎపిసోడ్ టెలికాస్ట్ కావటానికి ఒకట్రెండు రోజుల ముందే బయటకు సమాచారం వచ్చేయటం.. అందుకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.

తాజా ఎపిసోడ్ తో ఫైనల్ కు చేరుకున్న టాప్ 5 ఫైనలిస్ట్ లు ఎవరన్న దానిపై స్పష్టత వచ్చేసింది. ఈ సీజన్ లో తనూజ.. డిమోన్ పవన్.. కల్యాణ్ పడాల.. ఇమ్మాన్యుయేల్.. సంజన గల్రానీలు టాప్ 5 ఫైనలిస్ట్ లుగా నిలిచారు. ఈ వారంలో డబుల్ ఎలిమినేష్ ఉండటం.. ఇందులో భాగంగా శనివారం సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా.. ఆదివారం ఎపిసోడ్ లో భరణి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు.

దీంతో.. టాప్ 5 ఫైనలిస్టులకు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇప్పటివరకు తాము అభిమానించే పోటీదారులు హౌస్ లో ఉండేందుకు.. వారిని రక్షించేందుకు వారి అభిమానులు ఓట్లు వేయటం తెలిసిందే. ఈ వారం మాత్రం తాము అభిమానించే వారిని గెలిపించటం కోసం ఓట్లు వేయాల్సి ఉంటుందని ఈ షో ప్రయాక్త నాగార్జున స్పష్టం చేశారు. మరి.. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విజేత ఎవరన్నది ఈ వారాంతంలో తేలిపోనుంది.

Tags:    

Similar News