ఓవర్సీస్ బాక్సాఫీస్ కింగ్ ఎవరు?.. 10 మిలియన్ల క్లబ్ లో మనోళ్ల రచ్చ!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు ఓవర్సీస్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఆయన నటించిన ఏకంగా 16 సినిమాలు 10 మిలియన్ల మార్కును దాటాయి.;

Update: 2025-12-15 04:25 GMT

భారతీయ సినిమాలు ఇప్పుడు కేవలం లోకల్ బాక్సాఫీస్ దగ్గరే కాదు, ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సత్తా చాటుతున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో వన్ మిలియన్ డాలర్లు వస్తే గొప్ప అనుకునేవారు. కానీ ఇప్పుడు 10 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ఒక బెంచ్ మార్క్ గా మారింది. ఈ విషయంలో మన స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా షారుఖ్ ఖాన్ ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు.

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు ఓవర్సీస్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఆయన నటించిన ఏకంగా 16 సినిమాలు 10 మిలియన్ల మార్కును దాటాయి. పాత సినిమాలు 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే', 'కభీ ఖుషీ కభీ ఘమ్' నుంచి మొన్నటి 'పఠాన్', 'జవాన్', 'డంకీ' వరకు విదేశాల్లో కాసుల వర్షం కురిపించాయి. ఈ రికార్డు ఇప్పట్లో ఎవరూ బ్రేక్ చేసేలా కనిపించడం లేదు. ఆ తర్వాత స్థానంలో సల్మాన్ ఖాన్ 9 సినిమాలతో 2వ స్థానంలో ఉన్నాడు. 'భజరంగీ భాయ్ జాన్', 'సుల్తాన్' వంటి సినిమాలు ఓవర్సీస్ లో బిగ్ హిట్స్.

ఇక సౌత్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ తన హవా చూపిస్తున్నారు. 'జైలర్', '2.0', 'కబాలి' వంటి సినిమాలతో మొత్తం 7 సార్లు ఈ మార్కును దాటి, దక్షిణాది నుంచి టాప్ ప్లేస్ లో నిలిచారు. అలాగే దళపతి విజయ్ కూడా 6 సినిమాలతో గట్టి పోటీ ఇస్తున్నారు. అతని బిగ్ హిట్స్ లియో', 'మెర్సల్'.

బాలీవుడ్ పని అయిపోయింది అనుకుంటున్న టైమ్ లో యంగ్ హీరోలు మళ్లీ జీవం పోశారు. ముఖ్యంగా రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ధురంధర్' ఏకంగా 350 కోట్లు రాబట్టి ఇండస్ట్రీకి బూస్ట్ ఇచ్చింది. 'పద్మావత్', 'బాజీరావ్ మస్తానీ' వంటి సినిమాలతో రణవీర్ ఖాతాలో కూడా ఇప్పుడు 6 సినిమాలు ఉన్నాయి. ఇక 2023లో వచ్చిన 'యానిమల్' సినిమాతో రణబీర్ కపూర్ సాలిడ్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. 'సంజు', 'యానిమల్', 'బ్రహ్మాస్త్ర' వంటి చిత్రాలతో రణబీర్ లిస్ట్ లో 5 సినిమాలతో ఉన్నారు.

మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ రేసులో దూసుకుపోతున్నారు. 'బాహుబలి' సిరీస్, 'సలార్', లేటెస్ట్ గా వచ్చిన 'కల్కి 2898 AD' సినిమాలతో ప్రభాస్ ఖాతాలో 5 సినిమాలు ఉన్నాయి. మొత్తానికి ఈ లిస్ట్ చూస్తుంటే ఇండియన్ సినిమా రేంజ్ గ్లోబల్ లెవెల్ లో ఎంత పెరిగిందో అర్థమవుతుంది. షారుఖ్ టాప్ లో ఉన్నా, మిగతా హీరోలు గట్టి పోటీనే ఇస్తున్నారు.

ఓవర్సీస్ లో 10 మిలియన్ డాలర్ల క్లబ్ హీరోల లిస్ట్

షారుఖ్ ఖాన్: 16 సినిమాలు

సల్మాన్ ఖాన్: 9 సినిమాలు

రజినీకాంత్: 7 సినిమాలు

ఆమిర్ ఖాన్: 6 సినిమాలు

రణవీర్ సింగ్: 6 సినిమాలు

విజయ్: 6 సినిమాలు

ప్రభాస్: 5 సినిమాలు

రణబీర్ కపూర్: 5 సినిమాలు

మిగిలిన హీరోలందరికీ 5 కంటే తక్కువ సినిమాలు ఉన్నాయి.

Tags:    

Similar News