దేఖ్‌లేంగే సాలా.. 24 గంటల్లో 3కోట్ల వీక్షణలతో రికార్డ్!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్- డిఎస్‌పి కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసింది. డిఎస్.పి మ్యాజికల్ ట్యూన్.. దానికి తగ్గట్టు పవన్ డ్యాన్సుల్లో గ్రేస్ ఇప్పుడు రికార్డుల గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. `గబ్బర్ సింగ్` పాటల తర్వాత మళ్లీ `ఉస్తాద్ భగత్ సింగ్` పాటల గురించి తెలుగు ప్రజల్లో ఉత్సుకత పెరిగింది. దానికి కారణం `దేఖ్ లేంగే సాలా`. గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బమ్ లోని ఒక పాట ఫిలిం సర్కిల్స్ తో పాటు, ప్రజల్లోను ఉత్సుకతను పెంచాయి.
తాజా సమాచారం మేరకు, `దేఖ్‌లేంగే సాలా` పాట చరిత్ర సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో వేవ్ క్రియేట్ చేసిన పాట మరొకటి లేదు. ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా దూసుకెళుతున్న యూనిక్ సాంగ్ ఇది.
చాలా కాలంగా రొటీన్ ట్యూన్స్ తో విసిగించిన డిఎస్‌పి మరోసారి మనసు పెట్టి ఈ పాట కోసం పని చేసాడని అర్థమవుతోంది. ఈ పాట ట్యూన్ కు తగ్గట్టే పవన్ స్టెప్పులు కూడా ఆడియెన్ ని ఆకర్షించాయి. ముఖ్యంగా దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ గొప్ప ప్రశంసలను అందుకుంది. భాస్కరభట్ల సాహిత్యం అదనపు బలం అనడంలో సందేహం లేదు. హరీష్ శంకర్ విజన్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సెట్లు, డిజైనర్ నీతా లుల్లా కాస్ట్యూమ్ వర్క్, రవి వర్మన్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఉస్తాద్ కి అదనపు బలాలు అనడంలో సందేహం లేదు. టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ అలాంటి విజువల్ ట్రీట్ ని పవన్ అభిమానులు ఆస్వాధించబోతున్నారనే పాజిటివిటీని దేఖ్ లేంగే పాట తీసుకుని వచ్చింది.
`దేఖ్ లేంగే` పాటకు దక్కుతున్న ఆదరణ నిజానికి ఈ సినిమా మేకర్స్‌లోను కొత్త ఉత్సాహం నింపింది. ఈ పాటను పాడినది విశాల్ దద్లాని- హరిప్రియ. భాస్కరబట్ల సాహిత్యం అందించగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. సంగీతం- కొరియోగ్రఫీ సరిగ్గా సెట్టయితే మ్యాజిక్ ఎలా ఉంటుందో ఈ పాట నిరూపిస్తోంది.