అమితాబ్‌తో ర‌జ‌నీ స్నేహం వెన‌క క‌ఠిన నిజం

అభిమానులు ఆ ఇద్ద‌రు లెజెండ్స్ క‌లిసి న‌టిస్తే చూడాల‌ని ఆశ‌ప‌డ‌తారు. దానిని నిజం చేస్తూ దాదాపు 33 సంవ‌త్స‌రాల త‌ర్వాత ర‌జ‌నీ-అమితాబ్ క‌టిసి న‌టించిన వెట్టైయాన్ 2024 అక్టోబ‌ర్ లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-12-15 04:07 GMT

నేడు భార‌త‌దేశంలోని లెజెండ‌రీ న‌టుల‌లో అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌జ‌నీకాంత్ స‌మ‌కాలికులుగా ఉన్నారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం అన్ని వేళ‌లా చ‌ర్చ‌నీయాంశ‌మే. ర‌జ‌నీ కోరాలే కానీ అమితాబ్ ఆయ‌న సినిమాలో న‌టించేందుకు క్ష‌ణ‌మైనా ఆలోచించ‌రు. అయితే ఈ ఇద్ద‌రి మ‌ధ్యా అనుబంధం ఈనాటిది కాదు! అనేది ఎందరికి తెలుసు. త‌న కెరీర్ తొలి నాళ్ల‌లో అమితాబ్ తో ప‌రిచ‌యం లేని రోజుల్లోనే ఆయన న‌టించిన సినిమాల రీమేక్‌ల‌లో న‌టించారు ర‌జ‌నీకాంత్. ఒక‌టి కాదు రెండు కాదు, ఏకంగా 14 రీమేక్ ల‌లో న‌టించారు ర‌జ‌నీ. అమితాబ్ తో అనుబంధం మొద‌లైందే రీమేక్‌ల‌తో.

అభిమానులు ఆ ఇద్ద‌రు లెజెండ్స్ క‌లిసి న‌టిస్తే చూడాల‌ని ఆశ‌ప‌డ‌తారు. దానిని నిజం చేస్తూ దాదాపు 33 సంవ‌త్స‌రాల త‌ర్వాత ర‌జ‌నీ-అమితాబ్ క‌టిసి న‌టించిన వెట్టైయాన్ 2024 అక్టోబ‌ర్ లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ద‌శాబ్ధాలుగా ఆ ఇద్ద‌రూ స్నేహాన్ని కొన‌సాగించారు. ఒక‌రి ఎదుగుద‌ల‌ను ఒక‌రు చూసారు. ఇప్ప‌టికీ అదే స్నేహం, గౌర‌వంతో త‌మ అనుబంధాన్ని కొన‌సాగిస్తుండ‌టం వారి విలువ‌ల‌కు నిద‌ర్శ‌నం.

అయితే ర‌జ‌నీకాంత్ న‌టించిన ఆ 14 రీమేక్ లు ఏవి? అంటే... వివ‌రాల్లోకి వెళితే... 1970-1980 మ‌ధ్య‌లో ర‌జ‌నీకాంత్ సూపర్‌స్టార్‌డమ్‌ను సంపాదించడంలో కీల‌క పాత్ర పోషించిన ఈ రీమేక్ ల వివ‌రాల్లోకి వెళితే, అమితాబ్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `అమర్ అక్బర్ ఆంథోనీ` (1977)ని ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా తమిళంలో `శంకర్ సలీం సైమన్` (1978) పేరుతో రీమేక్ చేసారు. ఒరిజిన‌ల్ లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను త‌మిళ వెర్ష‌న్‌లో రజనీకాంత్ పోషించారు.

అలాగే `మ‌జ్బూర్` చిత్రాన్ని `నాన్ వాళ వైప్పెన్` (1979) పేరుతో రీమేక్ చేసారు. వినోద్ ఖ‌న్నా న‌టించిన ఖూన్ ప‌సీనా (1977)ను టైగ‌ర్ పేరుతో ర‌జ‌నీ కథానాయ‌కుడిగా రీమేక్ చేసారు. అమర్ అక్బర్ ఆంథోనీ (1977) చిత్రాన్ని రామ్ రాబర్ట్ రహీమ్ (1980) పేరుతో రీమేక్ చేయ‌గా, ఒరిజిన‌ల్ చిత్రంలో వినోద్ ఖన్నా పోషించిన పాత్రను రజనీకాంత్ పోషించారు. ఇందులో అమితాబ్ ఒక పాత్ర‌ను పోషించారు. అమితాబ్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ డాన్ (1978)ని త‌మిళంలో బిల్లా పేరుతో రీమేక్ చేసారు ర‌జ‌నీ. అలాగే దీవార్ (1985) చిత్రాన్ని త‌మిళంలో `తీ` పేరుతో రీమేక్ చేసారు. `ఖుద్-దార్` (1982) కి త‌మిళ రీమేక్ `పడిక్కాతవన్` (1985). త్రిశూల్ (1978) కి తమిళ రీమేక్ `మిస్టర్. భరత్` (1986). `రోటీ కప్డా ఔర్ మకాన్` (1974) త‌మిళ రీమేక్ జీవన పోరాటం (1986). మర్ద్ (1985) కి తమిళ రీమేక్ మావీరన్(1986). అలాగే వేలైక్కారన్ (1987) హిందీ చిత్రం `నమక్ హలాల్` (1982) కి తమిళ రీమేక్

కస్మే వాదే (1978) తమిళ రీమేక్ ధర్మతిన్ తలైవన్ (1988). ఖూన్ పసీనా (1977) చిత్రానికి తమిళ రీమేక్ శివ (1989). లవారీస్ (1981) కి తమిళ రీమేక్ పనక్కారన్ (1990). ఈ సినిమాల‌న్నిటిలో ఒరిజిన‌ల్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను రజనీకాంత్ పోషించారు. బిగ్ బి న‌టించిన‌ 14 రీమేక్‌లలో నటించిన తర్వాత రజనీకాంత్ - బిగ్ బి 1991లో వచ్చిన `హమ్` చిత్రంలో కలిసి నటించారు. ఆ తర్వాత చివ‌రిగా 2024లో `వెట్టైయన్`లో ఆ ఇద్ద‌రూ క‌లిసి నటించారు.

రజనీకాంత్ హిందీ సినీరంగంలో అడుగుపెడుతూ, మూడు మల్టీ హీరో ప్రాజెక్టులలో బచ్చన్‌తో కలిసి నటించారు. 1983లో వ‌చ్చిన `అంధా కానూన్` (1983), బచ్చన్ ప్రత్యేక పాత్రలో- ధర్మేంద్ర అతిధి పాత్రలో నటించారు. ఇది ఆ సంవత్సరంలో ఐదవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. ఆ త‌ర్వాత `గెరఫ్తార్` (1985) అనే చిత్రంలో అమితాబ్ బచ్చన్ -కమల్ హాసన్‌తో పాటు రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించారు. 1991లో వ‌చ్చిన హ‌మ్ చిత్రంలో బచ్చన్ ప్రధాన పాత్రలో, రజనీకాంత్, గోవిందా సోదరులుగా నటించారు.

Tags:    

Similar News