పాల రాతి శిల్పంలా శ్రీలీల.. ట్రెడిషనల్ లుక్లో కట్టిపడేస్తోందిగా..

లేటెస్ట్ గా శ్రీలీల షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రీమ్ కలర్ డిజైనర్ లెహంగాలో ఆమె అచ్చం దేవకన్యలా మెరిసిపోతున్నారు.;

Update: 2025-12-14 18:30 GMT

టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్గా ఎంట్రీ ఇచ్చి, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు శ్రీలీల. తన ఎనర్జిటిక్ స్టెప్పులతో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కుర్రాళ్ళ మనసు దోచుకున్న ఈ భామ, గ్లామర్ విషయంలోనూ ఏమాత్రం తీసిపోరు. మోడ్రన్ డ్రెస్సుల్లో ఎంత ట్రెండీగా కనిపిస్తారో, సంప్రదాయ దుస్తుల్లో అంతకంటే అందంగా కనిపిస్తారని నిరూపించారు.




 


లేటెస్ట్ గా శ్రీలీల షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రీమ్ కలర్ డిజైనర్ లెహంగాలో ఆమె అచ్చం దేవకన్యలా మెరిసిపోతున్నారు. ఆ దుస్తులపై ఉన్న షైనింగ్, ఆమె చర్మానికి తగ్గట్టుగా బ్లెండ్ అయ్యి, ఒక పాలరాతి శిల్పంలా కనిపిస్తున్నారు. సింపుల్గా కనిపిస్తూనే ఎంతో రాయల్ లుక్ను సొంతం చేసుకున్నారు.




 


ఈ లుక్లో శ్రీలీల ధరించిన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెడలో హెవీ డైమండ్ సెట్, చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, నుదుటిన పాపిట బిళ్ళతో ఆమె అలంకరణ అదిరిపోయింది. జడలో మల్లెపూలు పెట్టుకుని, వాటి సువాసనలు వెదజల్లుతున్నట్లుగా ఆమె ఇచ్చిన పోజులు చూస్తుంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.




 


గతంలో ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో, మాస్ బీట్స్కే పరిమితమైన శ్రీలీల, ఇలా క్లాసీ లుక్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె కళ్ళలోని మెరుపు, పెదాలపై చిరునవ్వు ఫ్యాన్స్ను కట్టిపడేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆమెను బాపు బొమ్మతో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.




 


ప్రస్తుతం శ్రీలీల చేతిలో బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవలే ఓ స్పెషల్ సాంగ్తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, నటిగా తన పరిధిని పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. మాస్ అయినా, క్లాస్ అయినా తనకే సెట్ అవుతుందని ఈ లేటెస్ట్ ఫొటోషూట్తో మరోసారి రుజువు చేశారు. రీసెంట్ గా తెలుగులో ఆమెకు మాస్ జాతర సినిమాతో డిజాస్టర్ ఎదురైంది. ఇక బాలీవుడ్ లో త్వరలోనే ఒక క్రేజీ ప్రాజెక్టుతో రానుంది. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News