#హాట్ టాపిక్: ఖైదీ లాభాలు `సైరా`లో పోయాయా?

Update: 2020-03-02 04:59 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `సైరా: న‌ర‌సింహారెడ్డి` న‌టుడిగా చిరంజీవికి మంచి పేరు తెచ్చినా బాక్సాఫీస్ వ‌ద్ద న‌ష్టాలు త‌ప్ప‌లేదు. తెలుగులో బంప‌ర్ హిట్ సాధించినా.. ఇత‌ర భాష‌ల్లో ముఖ్యంగా హిందీలో చెప్పుకోద‌గ్గ వ‌సూళ్లు సాధించ‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. అస‌లు రాజీ అన్న‌దే లేకుండా సినిమాని నిర్మించేందుకు భారీగా బ‌డ్జెట్ వెచ్చించిన నిర్మాత రామ్‌ చ‌ర‌ణ్ కు ఫ‌లితం నిరాశ‌నే మిగిల్చింద‌న్న చ‌ర్చా సాగింది.

అయితే సైరా విష‌య‌మై నిర్మాత రామ్ చ‌ర‌ణ్ ఓ వేదిక‌పై కాస్త ఎమోష‌న్ గానే మాట్లాడారు. నాన్న‌గారు రూపాయి పారితోషికం అయినా తీసుకోకుండా న‌టించార‌ని.. 64 ఏళ్ల వ‌య‌సులో 250 రోజులు నిరంత‌రం సినిమా కోసమే త‌పించార‌ని తెలిపారు. ఆయ‌న‌కు ఏం ఇచ్చి రుణం తీర్చుకోవాలో అర్థం కావ‌డం లేద‌ని అన్నారు. అంతేకాదు లాభాలు వ‌చ్చిన‌ప్పుడు చూద్దాంలే అని చిరు అన్నార‌ట‌.

అయితే సైరా రిజ‌ల్ట్ తో తీవ్ర నిరాశ త‌ప్ప‌లేదు. ఇక లాభాలు రాలేదు కాబ‌ట్టి చిరుకి పారితోషికం ఇవ్వ‌లేద‌నే అభిమానులు భావిస్తున్నారు. ఇక సైరాతో వ‌చ్చిన‌ న‌ష్టాల్ని పూడ్చేందుకు చ‌ర‌ణ్ చాలానే జాగ్ర‌త్త ప‌డాల్సి వ‌చ్చింది. అంతేకాదు ఖైదీనంబ‌ర్ 150 చిత్రంతో కొణిదెల సంస్థ‌కు భారీ లాభాలొచ్చాయి. ఇప్పుడు వాట‌న్నిటినీ సైరా రూపంలో కోల్పోవాల్సి వ‌చ్చిందా? అన్న చ‌ర్చా సాగింది.

ఇక మెగాస్టార్ త‌న కెరీర్ 152వ చిత్రంలో న‌టిస్తున్నారు. కొర‌టాల శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ దేవాద‌య భూముల కుంభకోణం నేపథ్యంలో తెర‌కెక్కుతోంది. స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాల‌తో ముడిప‌డిన అంశాలు క‌థ‌లో ఉన్నాయ‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఇక ఓ పిట్ట క‌థ‌ సినిమా ఈవెంట్లో చిరు స్వ‌యంగా `ఆచార్య` టైటిల్ ని క‌న్ఫామ్ చేసేయడం షాకిచ్చింది.
Tags:    

Similar News