'వర్కౌట్'లతో నాజూకుదనం బాగానే చూపుతోందిగా!

Update: 2021-02-20 02:51 GMT
టాలీవుడ్ కుర్రకారుకు సొట్టబుగ్గల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మోస్ట్ ఫేవరేట్ హీరోయిన్లలో ఒకరు. మొదటి నుండి అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. కెరీర్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే స్టార్డం సంపాదించుకుంది రకుల్. అవకాశాలు ఎక్కడి నుండి వస్తే అక్కడ వాలిపోతుంది. తెలుగుతో పాటు అమ్మడు తమిళ, హిందీ భాషలలో కూడా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం సినిమాల పరంగా వేగం తగ్గించినప్పటికి వర్కౌట్స్ పరంగా ఫుల్ బిజీ అంటోంది భామ. ఇటీవలే తెలుగులో నితిన్ సరసన చెక్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో కొండపోలం అనే సినిమాలో యాక్ట్ చేసింది. ఫిబ్రవరి 26న చెక్ సినిమా తెరమీదకి రాబోతుంది. అయితే సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో రకుల్ హవా మాములుగా లేదు.

ఇప్పటికే చాలా నాజూకుగా ఉన్న రకుల్ మరింత నాజూకుగా మారేందుకు తెగ వర్కౌట్స్ చేస్తోందట. రకుల్ ఫిట్నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అందరికి తెలిసిందే. ఖాళీ దొరికితే అమ్మడు వ్యాయామం చేస్తూ వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రకుల్.. ఎప్పటికప్పుడు తన వర్కౌట్స్ సంబంధించిన ఫోటోలు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా అమ్మడి వర్కౌట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వయ్యారి పోజులు చూస్తే ఎవ్వరికైనా మతి పోవాల్సిందే. ఎలాంటి స్కిన్ షో లేకుండా అలా వెనక గోడవైపు వెనకనుండి కాళ్ళు, చేతులు ఆనించిన పిక్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఆ పోజు చూస్తేనే అర్ధమవుతుంది రకుల్ తన స్లిమ్ ఫిగర్ కోసం ఎప్పుడైనా వర్కౌట్ చేస్తుందని.. అందుకే ఫ్యాన్స్ లైక్స్, షేర్స్ అంటూ వైరల్ చేస్తున్నారు.


Tags:    

Similar News