#లేడీ డ్రైవర్స్.. తమన్నా బస్సు నడిపితే రకుల్ లారీ తోల్తోంది!
గోపీచంద్ సరసన `సీటీమార్` చిత్రంలో నటిస్తున్న తమన్నా.. ఇందులో నామ్ హై జ్వాలారెడ్డి.. నికాల్ దూంగ సబ్ కా హడ్డీ..!! అంటూ పవర్ ఫుల్ పాత్రతో రక్తి కట్టించనుంది. ఈ రోల్ రెబల్ రాణి టైప్. తను ఏకంగా బస్ నడిపించేస్తుంది. ఎదుటివారితో గొడవలకు దిగుతుంది.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ `సర్దార్ కా గ్రాండ్సన్` సెట్లో ట్రక్కును డ్రైవ్ చేసేందుకు స్టీరింగ్ పట్టుకుంది. ఆ పని కోసం డ్రైవర్ సీట్లో కూచుంది రకుల్. అయితే జ్వాలారెడ్డిలా రకుల్ రెబల్ రాణి కాదు కానీ.. తను చాలా వివేకవంతమైన సైలెంట్ గా ఉండే అమ్మాయి. తన అనుభవంపై రకుల్ మాట్లాడుతూ.. ``నేను వ్యక్తిగతంగా చాలా డ్రైవింగ్ చేయడాన్ని ఇష్టపడతాను. లారీ నడపే ప్రక్రియ ఊహించిన దానికంటే చాలా సరదాగా ఉంది. ట్రక్కును నడపడం అంత సులభం కాదు. కానీ నేను దానిని నమ్మకంగా ప్రయత్నించాను`` అని తెలిపింది.
పెద్ద ట్రక్కును ఎలా నడిపించాలో మాకు శిక్షణ ఇవ్వడానికి సెట్లో ట్రక్ డ్రైవర్ ఉన్నారు. అతడి సాయం పనిచేసింది. సెట్లో జనం నా డ్రైవింగ్ నైపుణ్యంతో ఆశ్చర్యపోయారు! ఇది నాకు జీవితకాలంలో గొప్ప అనుభవం.. అని రకుల్ ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఏప్రిల్ 25 న విడుదల కానున్న `జీ ని కర్దా..` పాట కొత్త పోస్టర్ ను కూడా రకుల్ షేర్ చేసింది.
ఈ చిత్రం అమ్రీక్ సింగ్ (అర్జున్ కపూర్ ) అతడి అమ్మమ్మ రూపీందర్ కౌర్ (నీనా గుప్తా) మధ్య ఉన్న అనుబంధం చుట్టూ తిరిగే కామెడీ ఎంటర్ టైనర్. అతని వివేకవంతమైన ప్రవర్తన ప్రతి ఒక్కరినీ వెర్రివాళ్ళని చేస్తుంది. రాధ అనే వివేకవంతమైన అమ్మాయిగా రకుల్ నటించింది.