బికినీ బీచ్ బేబీని అంటూ స‌ర్టిఫికెట్ ఇచ్చుకుంది!

Update: 2020-11-23 08:30 GMT
కొన్ని బాడీలు బికినీకి యాప్ట్. చాలామంది అస్స‌లు సూట్ కారు. సౌత్ లో బెస్ట్ బికినీ బేబీ ఎంద‌రున్నారు? అంటే.. అందులో ర‌కుల్ పేరు త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. ఆర‌డుగుల‌కు కాస్త అటూ ఇటూగా ఉండే ఈ అమ్మ‌డు బికినీ వేస్తే క‌ళ్లు తిప్పుకోవ‌డం అంత సులువేమీ కాదు. ప‌ర్ఫెక్ట్ ఫిట్ బాడీతో ర‌కుల్ విజువ‌ల్ ఫెస్టివ‌ల్ కి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

ప్ర‌స్తుతం మాల్దీవుల విహారంలో ఉన్న ఈ భామ అక్క‌డ బికినీ బీచ్ ల‌ను షేక్ చేస్తోంది. నిరంత‌రం వేడెక్కించే బికినీ ఫోటోషూట్ల‌తో అంతకంత‌కు అగ్గి రాజేస్తోంది. ``నేను కేవలం బీచ్ అమ్మాయిని`` అంటూ రాకుల్ ప్రీత్  ఇచ్చిన ట్యాగ్ చూస్తుంటే ఏ రేంజులో చెల‌రేగుతోందో అర్థం చేసుకోవ‌చ్చు. అదిరిపోయే బికినీ ఫోటోని షేర్ చేసి కుర్ర‌కారును ఓ రేంజులోనే క‌వ్వించేస్తోంది.

ర‌కుల్ ప్రస్తుతం తన కుటుంబంతో పాటు మాల్దీవుల్లో ఉంది. తన వెకేష‌న్ నుండి చురుకుగా ఫోటోలను పంచుకుంటోంది. సోమవారం ఉదయం రకుల్ ప్రీత్ సింగ్ వేడెక్కించే బికినీ ఫోటోని షేర్ చేసింది.

తాజాగా షేర్ చేసిన వేరొక బికినీ ఫోటో చూశాక‌.. రకుల్ ప్రీత్  స్నేహితురాలు అయిన నటి లక్ష్మి మంచు ఏమ‌న్నారంటే..``ఈ చిత్రంతో ఊ.. హూల్లల్లా ఇన్ ‌స్టాలో మంట‌లే`` అంటూ క‌వ్వింత‌గా వ్యాఖ్యానించారు.

ఇంత‌కుముందు తన స్కూబా డైవింగ్ సెషన్ నుండి ఒక ఫోటోని ర‌కుల్ పోస్ట్ చేసింది. నీటి అడుగున ప్రపంచాన్ని అనుభవించడం స్వచ్ఛమైన ఆనందం. 3/4 వ భాగం ఈ గ్ర‌హం ఎంత అందంగా ఉందో నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దాని గురించి మన‌కు ఎంత తక్కువ తెలుసు అంటూ వ్యాఖ్యానించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోల‌న్నీ అభిమానుల్లో వైర‌ల్ గా మారాయి.
Tags:    

Similar News