మినీ రివ్యూ: రకుల్ ప్రీత్ బాలీవుడ్ మూవీ 'సర్దార్ కా గ్రాండ్ సన్'
దక్షిణాదితో పాటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటున్న రకుల్ నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ''సర్దార్ కా గ్రాండ్ సన్''. ఇందులో అర్జున్ కపూర్ హీరోగా నటించగా.. జాన్ అబ్రహాం - అదితి రావు హైదరీ - నీనా గుప్తా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో కాష్వీ నాయర్ దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. జాన్ అబ్రహం - మోనిషా అద్వానీ - నిఖిల్ అద్వానీ - మధు భోజ్వానీ - భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు. తనిష్క్ బాగ్చి సంగీతం సమకూర్చగా.. మహేంద్ర శెట్టి సినిమాటోగ్రఫీ అందించారు. మాహిర్ జావేరి ఎడిటింగ్ వర్క్ చేశారు. దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడటంతో ఈ చిత్రాన్ని ఈరోజు (మే 18) నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం!
కథ విషయానికొస్తే.. అమ్రీక్(అర్జున్ కపూర్) తన గర్ల్ ఫ్రెండ్ రాధా(రకుల్ ప్రీత్) తో కలిసి యూఎస్ లో ఉంటారు. ఇండియాలో ఉన్న అమ్రీక్ నాన్నమ్మ సర్దార్(నీనా గుప్తా) ఆరోగ్యం బాగా లేదని ఫోన్ రావడంతో స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ లో ఉన్న తమ పూర్వీకుల ఇంటిని సందర్శించాలన్న ఆమె చివరి కోరిక గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అమ్రీక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనారోగ్యంతో ఉన్న తన ననానమ్మను పాకిస్తాన్ కు తీసుకెళ్ళి ఆమె కోరికను ఎలా నెరవేరుస్తాడు? అనేదే 'సర్దార్ కా గ్రాండ్ సన్' సినిమా.
తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాలో అర్జున్ కపూర్ - రకుల్ ప్రీత్ సింగ్ నటనకు మంచి పేరే వస్తోంది. అయితే వీళ్లకు మించి నాన్నమ్మ పాత్రలో నటించిన నీనా గుప్తా పాత్రకు మంచి మార్కులు పడుతున్నాయి. 90 ఏళ్ల వ్యక్తిగా ఆమె కనబరిచిన నటనకు.. ఆమె పండించిన ఎమోషన్స్ కు ప్రేక్షకుల ప్రశంసలు దక్కుతున్నాయి. రకుల్ తన పాత్ర పరిధి మేరకు నటించడమే కాకుండా లుక్స్ పరంగా ఆకట్టుకుంటుంది. అలానే అర్జున్ కపూర్ కూడా తన నటనలో పరిణితి చూపించాడు. ఇక స్పెషల్ రోల్స్ లో నటించిన జాన్ అబ్రహం - అదిరిరావు హైదరి మెప్పించారు.
దర్శకురాలు కాశ్వీ మంచి ఎమోషనల్ కథని ఎంచుకున్నప్పటికీ సాగదీసే కథనంతో సినిమాని నడిపించినట్లు తెలుస్తోంది. అనవసరమైన సీన్స్ - సిల్లీ, లాజిక్ లేని సన్నివేశాలు కాస్త ఇబ్బంది కలిగించాయి. కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. తనిష్క్ బాగ్చి అందించిన సంగీతం కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ కి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. అలానే హార్ట్ టచింగ్ డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తం మీద కొన్ని బోరింగ్ ఎపిసోడ్స్ మినహా బలమైన ఎమోషన్స్ తో రూపొందిన 'సర్దార్ కా గ్రాండ్ సన్' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.