2.O మ్యూజిక్ ఆల్బమ్ తో షాకివ్వబోతున్న రకుల్
ఓవైపు టాలీవుడ్ లో బిజీగా కెరీర్ ని సాగిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ మరోవైపు బాలీవుడ్ లోనూ తెలివైన అడుగులు వేస్తోంది. అక్కడ వరుసగా పలు క్రేజీ చిత్రాలకు సంతకాలు చేసింది. మరోవైపు అర్జున్ కపూర్ తో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ మ్యూజిక్ వీడియో దిల్ హై దీవానాలో కనిపించనుంది. తాజాగా ఫస్ట్ లుక్ విడుదలైంది.
దర్శక ద్వయం రాధిక రావు- వినయ్ సప్రూ ఇటీవల ముంబైలో చిత్రీకరించిన రొమాంటిక్ డ్యాన్స్ ట్రాక్ ఆద్యంతం ఆకట్టుకోనుందని తెలిసింది. రకుల్ - అర్జున్ జోడీ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఈ పాటకు సంబంధించిన డీటెయిలింగ్ ఇచ్చారు. పాట మొదటి పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. మ్యూజిక్ ట్రాక్ ఈ ఏడాది ఏప్రిల్ 17 న విడుదల కానుంది. ``గుడ్ వర్సెస్ ప్రెట్టీ # దిల్ హై దీవానా` విడుదలకు సిద్ధం అని ఆ ఇద్దరూ వెల్లడించారు.
షబ్బీర్ అహ్మద్ రచించిన ఈ పాటను తనీష్ బాగ్చి స్వరపరిచారు. జరా ఖాన్- దర్శన్ రావల్ ఈ పాటకు గాత్రాన్ని అందించారు. కొత్త సింగిల్ గురించి మాట్లాడుతున్న టీసిరీస్ భూషణ్ కుమార్ మాట్లాడుతూ, ``దిల్ హై దీవానా మీ గో-టు డ్యాన్స్ సాంగ్.. దీని బీట్స్ మిమ్మల్ని కదిలిస్తుందని హామీ ఇస్తున్నాం. ఈ సరదా మ్యూజిక్ వీడియోలో అర్జున్ - రకుల్ చాలా కూల్ గా డప్పర్ గా కనిపిస్తారు. ప్రేక్షకులను మెప్పిస్తుందని భావిస్తున్నాను. నేను దీనిని ప్రేమిస్తున్నాను`` అని అన్నారు. అవుట్-అండ్-అవుట్ డ్యాన్స్ ట్రాక్ `సర్దార్ కా మనవడు`ని ఎలివేట్ చేయబోతోంది. అర్జున్ - రకుల్ జంటను ఆసక్తికరమైన దృశ్యాలలో చూస్తారు అని తెలిపారు.
మా పాటలు చిత్రాలలో సాధారణంగా మనకు అద్భుత కథల ప్రపంచం కనిపిస్తుంది. కానీ దిల్ హై దీవానాతో మేము ఈ ప్రపంచాన్ని కొద్దిగా 2.O వెర్షన్ లోకి తీసుకెళ్లాం. భిన్నమైన ఇంకా చాలా క్లాసిక్ కథ పాటలో ఉంటుంది అని దర్శకులు తెలిపారు.
ఆగష్టు 13 న విడుదల కానున్న యాక్షన్ చిత్రం అటాక్ లో జాన్ అబ్రహం సరసన రకుల్ కనిపిస్తుది. మేడే.. డాక్టర్ జి చిత్రాల్లోనూ రకుల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.