'ట్రాన్స్‌' లో ఉండిపోయిన రాజమౌళి

Update: 2020-12-26 23:30 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఎంత మంది స్టార్స్‌ ను సూపర్ స్టార్స్ ను చేశారు. ఆయన అంటే ఇండియన్‌ సినీ స్టార్స్ అందరికి కూడా ప్రత్యేకమైన అభిమానం.. గౌరవం.. ఆరాధన భావం ఉంటుంది అనడంలో సందేహం లేదు. అంతటి గొప్ప దర్శకుడు అయిన రాజమౌళికి ఒక చిన్న నటుడు బుర్రలో చేరి తెగ ఇది చేస్తున్నాడట. అతడే ట్రాన్స్‌ హీరో ఫహద్ ఫాసిల్‌. మలయాళ హీరో కమ్ నటుడు అయిన ఫహద్‌ చేసిన ప్రతి సినిమా చాలా విలక్షణంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈయన ఇటీవల చేసిన ట్రాన్స్ సినిమా ఆయన నటనకు ఆయన కు సినిమాపై ఉన్న ఆసక్తికి ప్రతీక అనడంలో సందేహం లేదు.

తెలుగులో ఆహా ద్వారా ట్రాన్స్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది. చాలా మంది ట్రాన్స్ చూసిన వారు ఫహద్ కు ఫ్యాన్స్‌ అవుతారు. అలాగే రాజమౌళి కూడా ఫహద్ కు అభిమాని అయ్యాడట. ఒక నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే తీసుకుని తీసే చేసే నిర్మాత. అందుకే ఫహద్‌ అంటే రాజమౌళికి ప్రత్యేకమైన అభిమానంగా చెబుతూ ఉంటారు.

ఈ లాక్ డౌన్‌ టైమ్‌ లో రాజమౌళి ఎన్నో వెబ్‌ సిరీస్ లు ఇతర భాషల సినిమాలు చూశారట. చాలా మంచి కంటెంట్‌ చూసిన నేను ఫహద్‌ వంటి మంచి నటుడిని కూడా చూశానంటూ రాజమౌళి సన్నిహితుల వద్ద అంటున్నాడట. అంతగా జక్కన్నకు నచ్చాడు కనుక తన రాబోయే సినిమాలో ఖచ్చితంగా రాజమౌళి ఫహద్‌ ను నటింపజేసే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News