మహేష్ - జక్కన్న ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళేది అప్పుడేనా..?
దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత మహేష్ తోనే సినిమా ఉంటుందని ఏడాది క్రితమే జక్కన్న క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఈ సినిమా కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నారు.
మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో వచ్చే సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండే అడ్వెంచర్ థ్రిల్లర్ అని బాహుబలి రచయిత ఇది వరకే స్పష్టత ఇచ్చారు. దీని కోసం జక్కన్న కు ఇష్టమైన దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ రచనలపై విజయేంద్ర ప్రసాద్ రీసెర్చ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక రాజమౌళితో కలిసి వర్క్ చేస్తుండటంపై మహేష్ బాబు మొదటి సారి స్పందించారు.
పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ తనకెంతో స్పెషల్ అని అన్నారు. అభిమానులందరూ ఎప్పటి నుంచో తమ కాంబోలో సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారని.. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడే ఏమీ మాట్లాడలేనని చెప్పారు. ఇది కచ్చితంగా మరో 'బాహుబలి' మాత్రం కాదని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.
మహేష్ ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలు పూర్తైన తర్వాత రాజమౌళి మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న మహేష్.. 2022 జనవరి 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ తన 28వ సినిమా చేయనున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.
దీనిని బట్టి చూస్తే 2022 వేసవిలో రాజమౌళి - మహేష్ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత జక్కన్న కాస్త విరామం తీసుకొని, మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల మీద కూర్చోనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఎస్ గోపాల్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
ఇకపోతే రాజమౌళి సినిమా కంటే ముందే మహేష్ పాన్ ఇండియా సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చేది యాక్షన్ జోనర్ మూవీ అని.. దీనికి పాన్ ఇండియా అప్పీల్ ఉందని.. పరిస్థితులను బట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసే ఆలోచన చేస్తామన్నట్లు చెప్పుకొచ్చారు. #SSMB28 తో ఇండస్ట్రీ హిట్ కొడతామని నమ్మకంగా చెబుతున్న మేకర్స్.. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.