రాజమౌళి తీసుకుంది.. 5లక్షలు శాలరీ

Update: 2015-08-06 09:40 GMT
బాహుబలి 500కోట్లు క్లబ్‌ లో చేరిపోయింది. 600కోట్ల వసూళ్ల దిశగా వెళుతోంది. ఇప్పటికీ థియేటర్లన్నీ హౌస్‌ ఫుల్‌ కలెక్షన్ల తో మునిగిపోతున్నాయి. ఈ హవా చూస్తుంటే బాలీవుడ్‌ దిగ్గజాలకే ముచ్చెమటలు పట్టేశాయి. అందుకే రాజమౌళి ది గ్రేట్‌ అని ఇంటా బైటా పొగిడేస్తున్నారు. ప్రపంచ సినీయవనికపై తెలుగువాడి సంతకం మొదలైందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రాజమౌళి ఇంత చేశాడు కదా.. నిర్మాతల నుంచి ఎంత తీసుకున్నట్టు? అన్న సందేహాలొస్తున్నాయి అభిమానులకు.

ఆర్కా మీడియా సంస్థ ఈ దర్శకదిగ్గజానికి ఆరంభంలోనే 5 కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చిందని ఓ టాక్‌. ఇది బ్యాంకులో వేసుకున్నా నెలకు రూ.5లక్షలు వడ్డీ వస్తుంది. దాంతోనే ఫ్యామిలీ గడిచిపోతుంది. ఇకపోతే ఆ శ్యాలరీ కాకుండా మనోడికి నెలకు 5 లక్షలు వర్కింగ్‌ వేజ్‌ క్రింద కూడా పే చేశారట. తనతో పాటు తన ఫ్యామిలీని కలుపుకొని, ఆ లెక్కన  అతడి ఫ్యామిలీ ప్యాకేజీ కింద ఓ 25 నుంచి 30 కోట్లు వేసుకోవడం ఖాయం. అలాగే ఇకనుండి 600 కోట్ల క్లబ్‌ సినిమానిచ్చిన దర్శకదిగ్గజం అయ్యాడు కాబట్టి నిర్మాతలు పలు కానుకల రూపంలో బోలెడంత ముట్టజెబుతారనడంలో సందేహమే లేదు.

ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి బాహుబలి 2 స్ర్కిప్టు వర్కులో నిమగ్నమై ఉన్నాడు. ఒక్కసారి స్ర్కిప్టు పని పూర్తవ్వగానే షూటింగ్‌ చేయడమే తరువాయి.
Tags:    

Similar News