విడాకుల త‌ర్వాత క‌లిసి మ‌ళ్లీ క‌లిసిన జంట‌.. లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన డైరెక్ట‌ర్

అయితే కాలం గడిచేకొద్దీ వారి మధ్య ఉన్న దూరం తగ్గుతూ వచ్చిందని తెలుస్తోంది. సుమారు ఆరు నుండి ఎనిమిది నెలల క్రితం ఈ ఇద్దరూ మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారని సమాచారం.;

Update: 2026-03-24 05:19 GMT

దశాబ్దం కింద‌ట‌ విడిపోయిన తర్వాత మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించిన ప్రముఖ డైరెక్ట‌ర్ ప్రియ‌ద‌ర్శ‌న్ మ‌రియు అత‌ని మాజీ భార్య లిస్సీ ల‌క్ష్మి ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. 2016లో అఫీషియ‌ల్ గా విడాకులు తీసుకున్న ఈ జంట, ఇప్పుడు మళ్లీ ఒక్కటై జీవించాలనే డెసిష‌న్ తీసుకోవడం వారి రిలేష‌న్‌కు ఒక కొత్త అధ్యాయంగా భావించవచ్చు.

పిల్ల‌ల ప్ర‌య‌త్నం వ‌ల్ల‌నే!

ఈ రీయూనియన్ కేవలం సెలబ్రిటీ వార్తగానే కాకుండా, కుటుంబ బంధాలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో మ‌రోసారి తెలియ‌చేస్తోంది. ముఖ్యంగా వారి పిల్లలైన కూతురు క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, కొడుకు సిద్ధార్థ్ ఈ మార్పులో కీలక పాత్ర పోషించినట్లు ఆ కుటుంబ స‌న్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు మళ్లీ దగ్గర కావాలని వారు చేసిన‌ ప్రయత్నం వ‌ల్ల‌నే ఆ జంట ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం.

2016లో విడాకులు తీసుకున్న జంట‌

ఇదిలా ఉండగా, 1990లో పెళ్లి చేసుకున్న ఈ జంట దశాబ్దాల పాటు కలిసి జీవించారు. కానీ, వ్యక్తిగత విభేదాలు, ముఖ్యంగా ఈగో సమస్యలు వారి సంబంధాన్ని దెబ్బతీశాయని ప్రియ‌ద‌ర్శ‌న్ గతంలో వెల్లడించారు. 2014లో విడాకుల ప్రక్రియ ప్రారంభమై, 2016లో అది అఫీషియ‌ల్ గా క్లోజ్ అయింది. ఆ టైమ్ లో ఈ విడాకులు ఎమోష‌న‌ల్ గా, కఠినంగా అనిపించాయని లిస్సీ ల‌క్ష్మి కూడా పేర్కొనడం గమనార్హం.

8 నెల‌ల నుంచే క‌లిసి జీవించాల‌ని నిర్ణయం

అయితే కాలం గడిచేకొద్దీ వారి మధ్య ఉన్న దూరం తగ్గుతూ వచ్చిందని తెలుస్తోంది. సుమారు ఆరు నుండి ఎనిమిది నెలల క్రితం ఈ ఇద్దరూ మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. ఈ జంట మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో లేరు. మ్యారేజ్ సర్టిఫికేట్ తప్ప మేము మళ్లీ అదే జీవితం కొనసాగిస్తున్నాం అని ప్రియ‌ద‌ర్శ‌న్ చెప్ప‌డం, వారి దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

ప‌ర్స‌న‌ల్ గా క‌లిసిన మ‌మ్ముట్టి

ఈ పరిణామంపై సినీ ఇండ‌స్ట్రీలోని ప్రముఖులు కూడా స్పందించారు. ముఖ్యంగా హీరో మ‌మ్ముట్టి ఈ జంటను ప‌ర్స‌న‌ల్ గా కలిసి తన ఆనందాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. రీసెంట్ గా చెన్నైలోని లిస్సీ స్టూడియోలో జరిగిన ఈ సమావేశం కూడా ఈ వార్తకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. మొత్తానికి, ఇది కేవలం ఒక సెలబ్రిటీ రీయూనియన్ కథ మాత్రమే కాదు.. ఇది సెకండ్ ఛాన్స్, ఫ్యామిలీ రిలేష‌న్స్ మరియు కాలంతో మారే మనుషుల ఎమోష‌న్స్ గురించి చెప్పే కథ.

Tags:    

Similar News