ధురంధర్ 2.. రీల్స్, షార్ట్స్ ఎక్కడ?

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.;

Update: 2026-03-24 06:00 GMT

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన మొదటి వారంలోనే ఆ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా వీకెండ్ తర్వాత సోమవారం కలెక్షన్లు తగ్గడం సహజం. కానీ ఆ సినిమా మాత్రం ఆ ట్రెండ్‌ ను పూర్తిగా మార్చేసింది.

విడుదలైన ఐదు రోజుల్లోనే ధురంధర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 829.76 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలో మాత్రమే రూ. 519.12 కోట్ల నెట్ (గ్రాస్ రూ. 619.76 కోట్లు) వసూలు చేయడం ఆ సినిమా జోష్ కు నిదర్శనం. ముఖ్యంగా మొదటి సోమవారం అయిన ఐదో రోజు కూడా రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్లు రావడం విశేషం. ఇది సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది.

ఓవర్సీస్ మార్కెట్‌ లో కూడా సినిమా తన సత్తా చాటుతోంది. విదేశాల్లో ఇప్పటికే రూ. 210 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. దీంతో మొత్తం కలెక్షన్లు రూ. 829.76 కోట్లను దాటాయి. ఇదే రేంజ్ లో కొనసాగితే ధురంధర్ 2 గ్లోబల్ రేంజ్ లో మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత భారీ విజయాన్ని సాధించే దిశగా పయనిస్తోంది.

అయితే వసూళ్ల పరంగా దూసుకుపోతున్న ఆ సినిమా, మ్యూజిక్ విషయంలో మాత్రం చర్చకు దారి తీసింది. మొదటి భాగమైన ధురంధర్ లో పాటలు, నేపథ్య సంగీతం విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఎంట్రీ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీల్స్, షార్ట్స్ రూపంలో భారీగా ట్రెండ్ అయ్యాయి.

కానీ ధురంధర్ 2 విషయంలో మాత్రం ఆ రేంజ్ మ్యూజికల్ ఇంపాక్ట్ కనిపించడం లేదని పలువురు సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. పాటలు ఉన్నప్పటికీ అవి సోషల్ మీడియాలో పెద్దగా ట్రెండ్ కావడం లేదు. ఫస్ట్ పార్ట్ లాగా రీల్స్, షార్ట్స్ కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది. ఆ అంశమే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌ గా మారింది.

అయినా కూడా సినిమా ప్రమోషన్ మాత్రం స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, కీలక సీన్లు వైరల్ అవుతూ సినిమాపై మరింత హైప్‌ ను పెంచుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూడాలనే ఆసక్తి కంటెంట్ పెంచుతోంది. మొత్తానికి, మ్యూజిక్ విషయంలో కొంత లోటు ఉన్నప్పటికీ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. కలెక్షన్ల పరంగా ఫస్ట్ పార్ట్‌ ను మించి, ఇండియన్ సినీ చరిత్రలో మరో బిగ్ హిట్‌ గా నిలిచే అవకాశం ఉంది.

Tags:    

Similar News