టాప్ స్టోరి: నటనలో రాణించిన నిర్మాతల కుమార్తెలు
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కేవలం వారసత్వంగా కాకుండా.. తమదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటీమణులలో నిర్మాతల కుమార్తెలు ముందు వరుసలో ఉన్నారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కేవలం వారసత్వంగా కాకుండా.. తమదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటీమణులలో నిర్మాతల కుమార్తెలు ముందు వరుసలో ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషా చిత్ర పరిశ్రమలలో ప్రముఖ నిర్మాతలు.. నటుల కుటుంబాల నుంచి వచ్చిన కుమార్తెలు నటనారంగంలో అడుగుపెట్టి అగ్ర తారలుగా, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ట్రెండ్ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. నేటి తరం నటీమణులు కూడా దీనిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమ (టాలీవుడ్) విషయానికి వస్తే.. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా, హోస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటగా... నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వెబ్ సిరీస్‌లు - సినిమాల ద్వారా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తాజాగా ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ కుమార్తె హన్విక `ఇడుపు కాయితం` చిత్రంలో చిన్న డాక్టర్ పాత్ర ద్వారా బాలనటిగా అరంగేట్రం చేసి సినీ వర్గాల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నారు.
ఇక తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్) లోనూ ఈ వారసత్వ ప్రయాణం ఘనంగా కొనసాగుతోంది. ప్రముఖ నిర్మాత జి. సురేష్ కుమార్ కుమార్తె కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా నిలిచి దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అలాగే కమల్ హాసన్ కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షర హాసన్ ... శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్‌కుమార్ వంటి వారు పవర్-ప్యాక్డ్ పాత్రలతో, వైవిధ్యమైన రోల్స్‌తో తమిళ, తెలుగు పరిశ్రమలలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
హిందీ చిత్ర పరిశ్రమ (బాలీవుడ్) లో అయితే నిర్మాతలు .. నటుల కుటుంబాల నుండి వచ్చిన తారల జాబితా చాలా పెద్దదే ఉంది. కపూర్ కుటుంబం నుండి కరిష్మా, కరీనా కపూర్ లతో పాటు.. బోనీ కపూర్ కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ .. శక్తి కపూర్ కుమార్తె శ్రద్ధా కపూర్ వంటి ప్రముఖులు బాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు. ఇలా తమ కుటుంబాల లెగసీని కొనసాగిస్తూనే సొంత ప్రతిభతో ఈ ముద్దుగుమ్మలు అన్ని ప్రధాన ఇండస్ట్రీలలోనూ అగ్రగామిగా వెలుగొందుతున్నారు.
బాలనటిగా బన్ని వాసు కుమార్తె..
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా రాణిస్తున్న బన్నీ వాస్ వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ ఒక అరుదైన ఆనందాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన కుమార్తె హన్విక ఇప్పుడు వెండితెరపై బాలనటిగా అరంగేట్రం చేయడం టాలీవుడ్లో విశేష చర్చనీయాంశమైంది. `ఇడుపు కాయితం` చిత్రంలోని `శ్రీలత` పాటలో హన్విక చిన్న డాక్టర్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకోనున్నారు.
గతంలోనూ హన్విక కొన్ని సినీ వేడుకలలో అప్పుడప్పుడు సందడి చేశారు. ముఖ్యంగా `18 పేజెస్` చిత్ర ప్రారంభోత్సవంలో ఆమె కెమెరా స్విచ్ ఆన్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఇప్పుడు ఏకంగా తన తండ్రి బన్నీ వాస్ , తబితా సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న `ఇడుపు కాయితం`సినిమా ద్వారా బాలనటిగా అధికారికంగా తెరపైకి అడుగుపెట్టడం విశేషం. ఈ ప్రత్యేక అనుభూతిపై ఇటీవల జరిగిన చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో బన్నీ వాస్ తన ఆనందాన్ని పంచుకున్నారు. తన కుమార్తెను వెండితెరపై పెద్ద స్క్రీన్‌పై చూసుకోవడం తన జీవితంలోనే అత్యుత్తమ క్షణాల్లో ఒకటని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. ఒక తండ్రిగా తన కూతురి తొలి నటనను బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంతో గర్వపడినట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది.