ఆ హీరోల ఫ్యాన్స్‌ ఏం చేస్తున్నారు?

స్టార్‌ హీరోల నుంచి చిన్న సెలబ్రిటీల వరకు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ ఎదుర్కోవడం ఈమధ్య కాలంలో సర్వసాధారణం అయింది.

Update: 2026-10-25 17:30 GMT

స్టార్‌ హీరోల నుంచి చిన్న సెలబ్రిటీల వరకు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ ఎదుర్కోవడం ఈమధ్య కాలంలో సర్వసాధారణం అయింది. స్టార్స్‌ తమపై జరుగుతున్న ట్రోలింగ్‌ను అడ్డుకునేందుకు స్వయంగా వారే స్పందిస్తే ఆ ట్రోల్స్ మరింత ఎక్కువ అవుతాయి. అందుకే వారు ట్రోల్స్ పై పెద్దగా స్పందించరు. ఎంత ట్రోల్స్ వచ్చినా వారి టీం మెంబర్స్ నుంచి స్పందన వస్తుందే తప్ప స్వయంగా వారే స్పందించిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండ కొందరు తనను కావాలని టార్గెట్‌ చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలపై మరింత ట్రోల్‌ జరిగిన విషయం తెల్సిందే. ఇక చిన్న సెలబ్రిటీలు మాత్రం వారిపై జరిగే ట్రోల్‌ ను వారే ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారికి అది కొన్ని సార్లు పబ్లిసిటీగా కూడా మారే అవకాశం ఉంటుంది. ట్రోల్స్‌ను ఎదుర్కొన్న వారిలో కొందరు పాపులారిటీని కూడా సొంతం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి.

ప్రభాస్‌ ఫౌజీ లుక్‌పై ట్రోల్స్‌...

ఇప్పుడు సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోలపై జరుగుతున్న ట్రోలింగ్‌ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన ఫౌజీ, స్పిరిట్‌ లుక్స్‌కి సంబంధించిన చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాలో మెజార్టీ జనాలు ప్రభాస్‌ లుక్‌ను తీవ్రంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఆ జుట్టు ఏంటి అంటూ చాలా మంది చాలా రకాలుగా చేస్తున్న ట్రోల్స్‌ తో ప్రభాస్‌ ఇమేజ్‌ డ్యామేజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఇంత జరుగుతున్నా ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రభాస్‌ పై జరుగుతున్న ట్రోల్స్‌ను ఫ్యాన్స్ తిప్పి కొట్టే ప్రయత్నాలు చేయడం లేదట. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ప్రభాస్‌కి వ్యతిరేకంగానే క్యాంపెయిన్‌ నడుస్తోంది.

సోషల్‌ మీడియాలో ప్రభాస్‌పై విమర్శలు...

ప్రభాస్‌ను అభిమానించే వారు కచ్చితంగా కోట్లలో ఉంటారు అనడంలో సందేహం లేదు. ఆయనకు పాన్‌ ఇండియా రేంజ్‌లో స్టార్‌డం ఉండటంతో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సైతం అదే రేంజ్‌ లో ఉంది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఆ జోరు కనిపించడం లేదు. ప్రభాస్ లుక్‌ గురించి గత రెండు రోజులుగా జరుగుతున్న ట్రోల్‌ క్యాంపెయిన్‌కి వ్యతిరేకంగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నుంచి ప్రతిఘటన పెద్ద ఎత్తున లేదు. కొందరు ప్రభాస్‌ లుక్ విషయంలో పాజిటివ్‌గా మాట్లాడినా, ట్రోల్స్‌కు సమాధానం చెప్పినా అది సరిపోవడం లేదు. ట్రోల్స్‌ జరుగుతున్న రేంజ్‌ లో ప్రభాస్‌కి మద్దతుగా నిలుస్తున్న వారి ట్వీట్స్ లేవు అనేది వాస్తవం. అందుకే సోషల్‌ మీడియాలో ప్రభాస్‌కి పాజిటివ్‌గా కంటే నెగిటివ్‌గా ఉన్న పోస్ట్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభాస్‌ ఫ్యాన్స్ ఎక్స్‌ లో రియాక్ట్‌ అయితే ట్రోల్స్‌ అనేవి కనిపించకుండా పోతాయి అనేది పరిశీలకుల మాట.

విజయ్‌ దేవరకొండ రణబాలి ప్రమోషన్‌లో...

ఈ మధ్య కాలంలో ప్రభాస్‌ తర్వాత ఎక్కువ ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్న హీరో విజయ్‌ దేవరకొండ. ఇటీవల విజయ్ దేవరకొండ రణబాలి ప్రమోషన్‌లో భాగంగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. ఆ వ్యాఖ్యలను కొందరు ట్రోల్‌ చేస్తున్నారు. ముఖ్యంగా కాఫీ విత్ కరణ్‌ షో లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. వాటిని తీసుకుని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్‌ చేస్తున్నారు. ఇక్కడ విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ సైతం తమ అభిమాన హీరోకు మద్దతుగా నిలవకుండా వేరే పనిలో ఉన్నట్లు ఉన్నారు. యాంటీ ఫ్యాన్స్‌ ట్రోల్స్‌ మాత్రమే సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్‌ చేస్తున్న ప్రశంసలు, ఇతర సినిమాలకు సంబంధించిన విషయాలు కనిపించడం లేదు. ఇదే ఏ మెగా హీరోకు లేదా మరే స్టార్‌ హీరోకు ట్రోల్స్ ఎదురైతే ఫ్యాన్స్‌ ఏ స్థాయిలో ప్రతిఘటిస్తూ ట్రోల్స్‌ ను ఎదుర్కొనే వారో చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ సైతం వారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వాళ్ళ వాళ్ళ ఫాన్స్ మధ్య చర్చ నడుస్తుంది.

Tags:    

Similar News