దీవాన 'ఇది ప్రేమ..' సాంగ్.. వినడానికి ఎంత బాగుందో!
ముఖ్యంగా హీరో పాత్రలో తెలంగాణ యాసను నేచరుల్ గా ఉపయోగించడం వల్ల ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.;
టాలీవుడ్ లో మరో కొత్త లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. యువ నటుడు హర్షిత్ రెడ్డి హీరోగా, స్మేహ మణిమేగలై హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం దీవాన. ప్రేమలో పడ్డ ఒక యువకుడు ఆ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లే దీవానగా ఎలా మారాడన్న కాన్సెప్ట్ తో సినిమా రూపొందుతుండగా.. ప్రేమలోని ఎమోషన్స్, చిన్న చిన్న మూమెంట్స్ ను ఇంటెన్స్ గా చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్స్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం విశేషం. తాజాగా మేకర్స్ ఆ చిత్రానికి సంబంధించిన ఇది ప్రేమ.. అనే మెలోడియస్ సాంగ్ ను విడుదల చేశారు.
ప్రస్తుతం ఆ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాట వినసొంపుగా ఉండటంతోపాటు, లిరిక్స్ కూడా హృదయాన్ని తాకేలా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 'ఏంటో మొదలైపోతుంది.. సోయి లేకుంది..' అంటూ సాగుతున్న ఆ పాటలో ప్రేమలోని ఎమోషన్స్ ను అందంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా "ఇది ప్రేమ, ప్రేమ గుండెలో అలజడి రేపేనా? ఇది ప్రేమ, ప్రేమ ఎదలో జరిగే రణమా? తెరపడి ఎదలో కురిసే వానా?" వంటి పదాలు వినిపించగానే ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
సాంగ్ ను ప్రముఖ గాయకుడు కార్తీక్ ఆలపించగా, సంగీతాన్ని ఈశ్వర్ చంద్ అందించారు. లిరిక్స్ ను చైతన్య పింగళి, ఈశ్వర్ చంద్ అందించగా.. సాంగ్ ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచి, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. రియల్ లోకేషన్లలో షూటింగ్ చేయడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ముఖ్యంగా హీరో పాత్రలో తెలంగాణ యాసను నేచరుల్ గా ఉపయోగించడం వల్ల ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. పల్లెటూరి ప్రేమ, భావోద్వేగాలు, జీవన విధానాన్ని ఆ సినిమా ద్వారా మరోసారి చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. తెలంగాణ అర్బన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్యూర్ లవ్ స్టోరీలో హర్షిత్ రెడ్డి తన నటనతో ఆకట్టుకునేలా ఉన్నారు.
ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో ఆయన నేచురాలిటీ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. హర్షిత్ రెడ్డి- స్మేహ మణిమేగలై కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి దీవాన మూవీ సాంగ్, టీజర్ తోనే మంచి హైప్ ను సొంతం చేసుకుంటూ సమ్మర్ రేస్ లో ఇంట్రెస్టింగ్ మూవీగా నిలవనుందని అర్థమవుతోంది. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.