టాలీవుడ్‌ లో ప్ర‌భాస్ హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్‌

Update: 2015-08-21 09:47 GMT
బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ క్రేజ్ ఒక్క‌సారిగా సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు పాకేసింది. ఈ సినిమా క‌నీసం నిర్మాత‌లు కూడా ఊహించ‌ని విధంగా అంచ‌నాల‌కు మించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఓవ‌రాల్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.560 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. బాహుబ‌లి సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో చాలా కాన్ఫిడెంట్‌ గా ఉన్న నిర్మాత‌లు బాహుబ‌లి 2ను కూడా ఎక్క‌డ కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించేందుకు రెఢీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే బాహుబ‌లి సినిమా కోసం రెండున్న‌రేళ్లుగా డేట్లు కేటాయించి..ఎంతో క‌ష్ట‌ప‌డిన ప్ర‌భాస్‌ కు టాలీవుడ్‌ లోనే అత్య‌ధిక పారితోష‌కం ముట్ట‌నుంది. ఈ సినిమాకు త‌న‌కు ద‌క్కే పారితోష‌కంతో ప్ర‌భాస్ టాలీవుడ్ హిస్ట‌రీ లోనే స‌రికొత్త రికార్డును క్రియేట్ చేయ‌బోతున్నాడు.

బాహుబ‌లి సినిమా ప్రారంభ‌మైన‌ప్పుడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌భాస్‌ కు సినిమా బ‌డ్జెట్ దృష్ట్యా తాను ఎక్క‌వ పారితోష‌కం ఇచ్చుకోలేనని చెప్పాడ‌ట‌. ఇలాంటి సినిమాలో చేయ‌డ‌మే గొప్పనుకున్న యంగ్‌ రెబ‌ల్ స్టార్ పారితోష‌కం గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయితే సినిమాకు భారీగా లాభాలు రావ‌డంతో పాటు..అందులో ప్ర‌భాస్ క‌ష్టాన్ని గుర్తించిన జ‌క్క‌న్న బాహుబ‌లి 2కు వ‌చ్చే లాభాల్లో ప్ర‌భాస్‌ కు కొంత మొత్తం  ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ని తెలుస్తోంది.

బాహుబ‌లి 2 కూడా ఏ ఆరేడు వంద‌ల కోట్లో వ‌సూలు చేస్తే ప్ర‌భాస్‌ కు ఇటు పారితోష‌కంతో పాటు అటు ప్రాఫిట్‌ లో ప‌ర్సంటేజ్ ఇస్తే టాలీవుడ్ హిస్ట‌రీలోనే హ‌య్య‌స్ట్ రెమ్య‌న‌రేష‌న్ తీసుకున్న హీరోగా ప్ర‌భాస్ చ‌రిత్ర పుటల్లో నిలిచిపోతాడు. అలాగే బాలీవుడ్ హీరోల పారితోష‌కంతో స‌మానంగా ప్ర‌భాస్‌ కు అంద‌నుంది.

బాహుబ‌లి హిట్‌ తో ప్ర‌భాస్ పేరు ఇప్ప‌టికే అన్ని భాష‌ ల్లోను మార్మోగుతోంది. ఈ లెక్క‌న బాహులి 2 కోసం దేశ‌వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. బాహుబ‌లి 2 వ‌సూళ్లు కూడా దిమ్మ‌తిరిగేలా ఉండ‌డం ఖాయ‌మంటున్నారు. అక్టోబ‌ర్ నుంచి బాహుబ‌లి 2 సెట్స్‌ పైకి వెళ్ల‌నుంది.
Tags:    

Similar News