రాజమౌళి చెప్పిన చెన్నకేశవరెడ్డి కథ

Update: 2017-01-21 06:41 GMT
‘ఆది’ లాంటి సెన్సేషనల్ హిట్ తో దర్శకుడిగా పరిచమయ్యాడు వి.వి.వినాయక్. అతడి పనితీరుకు ఇంప్రెస్ అయి వెంటనే తనతో సినిమా చేసే అవకాశాన్నిచ్చాడు నందమూరి బాలకృష్ణ. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమానే ‘చెన్నకేశవ రెడ్డి’. ఈ చిత్రంపై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ సినిమా ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఆ టైంలో వినాయక్.. బాలయ్యల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ గురించి రాజమౌళి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘‘చెన్నకేశవరెడ్డి సినిమాకు ముందే రిలీజ్ డేట్ ఇచ్చేయడంతో ఒక పాట షూట్ చేయడం కుదర్లేదు. దీంతో ముందు సినిమా రిలీజ్ చేసేసి.. ఆ తర్వాత పాట షూట్ చేసి.. దాన్ని తర్వాత కలుపుదామని వినాయక్ నిర్ణయించుకున్నాడు. ఐతే సినిమా రిలీజయ్యాక అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. టాక్ అనుకున్నంత గొప్పగా రాలేదు. అయినప్పటికీ పాట చిత్రీకరణ మొదలుపెట్టాడు వినాయక్. ఐతే టాక్ తెలుసుకుని వినాయక్ కొంచెం డల్ అయిపోయాడు. షూటింగ్ లో అందరూ కూడా కొంచెం డల్లుగానే ఉన్నారు. అప్పుడు బాలయ్య వినాయక్ దగ్గరికొచ్చి.. ఎందుకలా ఉన్నావని అడిగాడట. నువ్వు వంద శాతం కష్టపడ్డావు కదా అని అడిగాడట. దానికి వినాయక్ ఔనని బదులివ్వడంతో.. అలాగైతే బాధ పడాల్సిన పని లేదని.. వినాయక్ విషయంలో తాను చాలా హ్యాపీ అని.. మన ప్రయత్నం మనం చేశాం. రిజల్ట్ మన చేతుల్లో ఉండదని చెప్పి సర్దిచెప్పాడట. అంతే కాక తనతో ఇంకో సినిమా చేయాలనుకుంటే కథ రెడీ చేసుకుని రమ్మని కూడా బాలయ్య చెప్పాడట. ఈ విషయాన్ని నాకు వినాయక్ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. బాలయ్య అంత గ్రేట్ అన్నాడు’’ అని రాజమౌళి వెల్లడించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News